Begin typing your search above and press return to search.

పూన‌మ్ బ‌జ్వా మ‌ళ్లీ ఓవర్ వెయిట్!

ఇదిగో అమ్మ‌డు తాజాగా షేర్ చేసిన ఇన్ స్టారీల్స్ చూస్తే పూన‌మ్ శ‌రీరంలో ఎంత‌టి భారీ మార్పులొచ్చాయో అర్ద‌మైపోతుంది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 11:04 AM GMT
పూన‌మ్ బ‌జ్వా మ‌ళ్లీ ఓవర్ వెయిట్!
X

పూన‌మ్ బ‌జ్వా మ‌ళ్లీ బొద్దు అందంలోకి మారిపోయిందా? స్లిమ్ లుక్ నుంచి మ‌ళ్లీ చ‌బ్బీ లుక్ లోకి వ‌చ్చేసిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇదిగో అమ్మ‌డు తాజాగా షేర్ చేసిన ఇన్ స్టారీల్స్ చూస్తే పూన‌మ్ శ‌రీరంలో ఎంత‌టి భారీ మార్పులొచ్చాయో అర్ద‌మైపోతుంది. ఓ పాత సినిమా మ్యూజిక్ కి ఇలా కాపీ క‌ప్ ప‌ట్టుకుని డాన్సు చేస్తూ ఇల్లంతా తిరిగేసింది. చివ‌రికి గుమ్మం గ‌డ‌ప ముందుకెళ్లి! వ‌రండాలో కుర్రాళ్లేమైనా గ‌మ‌నిస్తున్నారా? అని కూడా ఓ లుక్ ఏసింది.

ఇక్క‌డ చ‌ర్చించాల్సింది రీల్ గురించి కాదు..పూన‌మ్ రూపం గురించే. అవును కెరీర్ ఆరంభంలో బొద్దు అందంతోనే టాలీవుడ్ కి ఎంట్రి ఇచ్చిన సొగ‌స‌రి అదే లుక్ తో ఇండ‌స్ట్రీలో కొన‌సాగింది. అయితే సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న త‌ర్వాత సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు క‌నిపించ‌డం మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో చ‌బ్బీలుక్ తో ఫోటోలో పెడుతుంటే విమ‌ర్శ‌లు ఎదుర్కుంది. దీంతో పూన‌మ్ స్లిమ్ లుక్ లోకి మారిపోయింది.

ముఖం నుంచి ప్ర‌తీ భాగంలోనూ చాలా మార్పులే క‌నిపించాయి. దీంతో పూన‌మ్ కూడా మ‌ల్లెతీగ రోయ్ అంటూ కుర్రాళ్లు పాట‌లు పాడుకున్నారు. కానీ తాజాగా వైర‌ల్ అవుతోన్న ఇన్ స్టా రీల్ చూస్తే షాక్ అవ్వ‌డం త‌ప్ప‌దు. ఎందుకంటే అమ్మ‌డు మ‌ళ్లీ పాత రూపంలోకి మారిపోయినట్లు క‌నిపిస్తుంది. మునుప‌టి కంటే రూపంలో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. వెయిట్ ఓవ‌ర్ గా పెరిగిన‌ట్లు క‌నిపిస్తుంది.

ముఖం నుంచి కాలి వేలి వ‌ర‌కూ ప్ర‌తీ భాగంలో మార్పులు కొట్టొచ్చాయి. ఫేస్ లో యాక్టివ్ నెస్ క‌నిపించ‌లేదు. డాన్సులో లేజీ త‌నం త‌ప్ప‌! ఎక్క‌డా ఎన‌ర్జీ క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. పూన‌మ్ ని అలా చూసి షాక్ అవ్వ‌డం అభిమానుల ప‌నైంది. ఇక పూన‌మ్ కెరీర్ సంగ‌తి చూస్తే అమ్మ‌డికి ఏ భాష‌లోనూ అవ‌కాశాలు లేవు. గ‌తేడాది మ‌ల‌యాళం..త‌మిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఇప్పుడా ప‌రిశ్ర‌మ‌లు కూడా ఛాన్సులు క‌ల్పించ‌లేదు.