Begin typing your search above and press return to search.

బ్రో వివాదంలో పూనమ్ కూడా...

ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రో మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా పై పూనమ్ ఇన్ డైరెక్ట్ గా ఓ ట్వీట్ చేసింది

By:  Tupaki Desk   |   2 Aug 2023 7:53 AM GMT
బ్రో వివాదంలో పూనమ్ కూడా...
X

పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు. ఆమె హీరోయిన్ గా సెటిల్ అవ్వాల ని టాలీవుడ్ లో అడుగుపెట్టింది కానీ, నటిగా కంటే, కాంట్రవర్సీల తోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ ల గురించే ఎక్కువగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ ఉంటుందని ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటారు. ఆమె కూడా ఎక్కువగా పొలిటికల్ సంబంధింత ట్వీట్స్ చేస్తూ దుమారం రేపుతూ ఉంటారు.

తాజాగా, మరోసారి ఆమె ట్వీట్ దుమారం రేపింది. ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రో మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా పై పూనమ్ ఇన్ డైరెక్ట్ గా ఓ ట్వీట్ చేసింది. 'ఈ మధ్య కాలం లో రాజకీయాలు అనేవి ఎంతో వినోదాత్మకంగా మారాయ్.. ఎంటర్టైన్మెంట్ అనేదేమో ఎంతో సీరియస్‌గా మారింది' అంటూ ట్వీట్ చేసింది. నిజానికి ఆ ట్వీట్ లో ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు, కనీసం ఎవరినీ ట్యాగ్ కూడా చేయలేదు.

కానీ, ఆ ట్వీట్ మాత్రం బ్రో మూవీ గురించే, ముఖ్యంగా పవన్ ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది అంటూ కింద కామెంట్స్ చూస్తే అర్థమౌతోంది. ఇంకేముంది పవన్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా తిట్టడం మొదలుపెట్టారు. పవన్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం పూనమ్ ని సమర్థించడం గమనార్హం. కరెక్ట్ గా చెప్పావ్ సిస్టర్ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు.

ఈ బ్రో మూవీ లో కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఏపీ మంత్రి అంబటి రాయుడు గతం లో వేసిన ఓ డ్యాన్స్ ని కమెడియన్ పృథ్వీ చేత అచ్చుగుద్దినట్లు వేయించారు. అక్కడ వివాదం రగిలింది. సినిమా చూస్తే, ఆ సీన్ బాగా పేలింది. కానీ, ఇక్కడ ఏపీ లోని అధికార పార్టీ నేతల కు మాత్రం బాగా కాలింది. ముఖ్యంగా అంబటి రాయుడు ఈ విషయం పై ప్రెస్ మీట్ పెట్టి కూడా విమర్శించారు.

తాము కూడా పవన్ మీద సినిమాలు తీస్తామని, ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల పై సినిమా తీస్తామంటూ కౌంటర్లు వేయడం విశేషం. ఇప్పటికే, ఈ విషయం పెద్ద దుమారంగా మారింది అనుకునేలోపు, పూనమ్ ఈ విషయం లో తలదూర్చి, మరింత పెద్దది చేయడం గమనార్హం.