Begin typing your search above and press return to search.

పూనం అందాల జాతర తో బేజారు

పొట్టి నిక్కర్‌ లో బికినీ ట్రీట్ చేసిన పూనమ్ బజ్వా అందాల జాతర ఈసారి అంతకు మించి అన్నట్లుగా అంటూ కొందరు కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 2:30 PM GMT
పూనం అందాల జాతర తో బేజారు
X

'మొదటి సినిమా' తో 2005 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా ఈ అమ్మడికి మంచి అవకాశాలు లభించాయి. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో ఈ అమ్మడి క్రేజ్ తగ్గింది. దాంతో ఇతర భాషల్లో ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు దక్కని విజయాలు మలయాళం మరియు కన్నడ సినీ పరిశ్రమలో లభించాయి. దాదాపుగా పదేళ్ల పాటు అక్కడ వరుసగా సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేందుకు.. మెప్పించేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.

ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటుంది. కాస్త బొద్దుగా ఉన్నా కూడా చాలా ముద్దుగా పూనం బజ్వా ఉంటుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పూనం ఇలా బొద్దుగా ఉంటేనే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు మాత్రం కాస్త సన్నబడితే సూపర్‌ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పూనం షేర్ చేసిన ఫోటోల్లో అందాల ఆరబోత చేసి కుర్రకారు బేజారు అయ్యేలా చేసింది. పొట్టి నిక్కర్‌ లో బికినీ ట్రీట్ చేసిన పూనమ్ బజ్వా అందాల జాతర ఈసారి అంతకు మించి అన్నట్లుగా అంటూ కొందరు కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లో యాంగిల్ లో తీసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రేంజ్ లో అప్పుడు స్కిన్ షో చేసి ఉంటే టాలీవుడ్‌ లో మంచి మంచి ఆఫర్లు వచ్చేవి కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పూనమ్ బజ్వా అందాల జాతరతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.. ముందు ముందు టాలీవుడ్‌ లో కూడా రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.