Begin typing your search above and press return to search.

ఆధారాలు ఉన్నాయి.. మళ్ళీ త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు!

సినీ పరిశ్రమలో చాలా కాలంగా నటి పూనమ్ కౌర్ చేస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 May 2025 1:35 PM IST
ఆధారాలు ఉన్నాయి.. మళ్ళీ త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు!
X

సినీ పరిశ్రమలో చాలా కాలంగా నటి పూనమ్ కౌర్ చేస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మళ్లీ ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుల ద్వారా మళ్లీ ఈ అంశాన్ని వెలికి తీసింది. “త్రివిక్రమ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి,” అంటూ పూనమ్ స్పష్టం చేశారు.


ఈసారి ఆమె రెండు స్క్రీన్‌షాట్లను కూడా షేర్ చేశారు. అవి ఝాన్సీతో జరిగిన చాట్స్ కావడం గమనార్హం. “ఫిర్యాదు చేశాను, ఆ విషయాన్ని ఇప్పటికే మీకు చెప్పాను. మళ్లీ చెబుతున్నాను,” అంటూ ఆమె వాటిలో పేర్కొన్నారు. “నా సమస్యను వివరిస్తూ మెయిల్ చేశాను. మీటింగ్ పెడదామని చెప్పి, తర్వాత నన్నే డిస్టర్బ్ చేయవద్దని చెప్పారు” అంటూ ఆమె మండిపడ్డారు.


ఈ ఆరోపణలపై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసిన పూనమ్‌ను, ‘స్వయంగా కలిసి లేదా మెయిల్ ద్వారా పంపాలని’ ‘మా’ సూచించిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు ఆమె చెబుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘మా’ నుండి స్పందన లేకపోవడం పట్ల పూనమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాను పాస్ చేసిన ఆరోపణలపై పరిశ్రమ పెద్దలు కూడా నిశ్శబ్దంగా ఉండిపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. “నా జీవితం, ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే నేను ఎక్కడకు వెళ్లాలి?” అనే మాటలు ఆమె పోస్టుల్లో కనిపించాయి. కొన్ని వర్గాల్లో అయితే, ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సమయంలో త్రివిక్రమ్‌తో వివాదం ముగిసిందని ప్రచారం సాగింది. అదే కారణంగా, ఈ పోస్టులు రాజకీయ ఉద్దేశ్యంతో పెట్టారని కామెంట్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో పూనమ్ మళ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించి, “ఇంత వరకు నేను ఎలాంటి రాజీ పడలేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. త్రివిక్రమ్ వెనుక రాజకీయ నాయకుల మద్దతు ఉందని అనుమానం ఉంది,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం, స్క్రీన్‌షాట్లు బయటపడటంతో ఈ కేసుపై మరొకసారి దృష్టి వెళ్లింది.

ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ అంశంపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. కానీ ఈసారి పూనమ్ కౌర్ వ్యవహారాన్ని మరింత బలంగా హైలైట్ చేస్తుండటంతో, పరిశ్రమలోనే కాకుండా సామాజిక వేదికలపైనూ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఆరోపణలపై త్రివిక్రమ్ ఎప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం.