Begin typing your search above and press return to search.

ఒపీనియ‌న్ పోల్ పెట్టిన పూన‌మ్ కౌర్‌

తాజాగా సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్‌చేసి షాక్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   24 May 2025 5:39 PM IST
ఒపీనియ‌న్ పోల్ పెట్టిన పూన‌మ్ కౌర్‌
X

హీరోయిన్ పూన‌మ్‌కౌర్ వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తూ వైర‌ల్ అవుతోంది. కొన్ని నెల‌ల క్రితం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించిన పూన‌మ్ ఇప్పుడు వ‌రుస పోస్ట్‌ల‌తో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ వెంట‌ప‌డుతూ షాక్ ఇస్తోంది. గ‌త కొంత కాలంగా సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటూ వ‌స్తున్న పూన‌మ్ ఉన్న‌ట్టుండి మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌పై దాడి చేయ‌డం మొద‌లు పెట్టింది. త్రివిక్ర‌మ్ విష‌యంలో త‌న‌ని సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నా ఎక్క‌డా త‌గ్గేదిలే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

తాజాగా సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్‌చేసి షాక్ ఇచ్చింది. `నేను ఇదివ‌ర‌కే చెప్పాను. అయిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ చెబుతున్నాను. మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను. ఆ త‌రువాత ఆమెను మ‌ళ్లీ క‌ల‌వ‌లేక‌పోయాను. కాస్త బిజీగా ఉన్నార‌ని డిస్ట‌ర్బ్ చేయొద్ద‌ని అన్నారు. నేను ఎవ‌రి పేర్లు చెప్ప‌లేద‌ని అన్నారు. ఇప్పుడు క్లియ‌ర్‌గా చెప్తున్నాను. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ పై నేను కంప్లైంట్ చేశాను. ఎవ‌రైతే రాజ‌కీయ అండ‌దండ‌ల‌తో త‌ప్పించుకుంటున్నారో అత‌డి మీద ఫిర్యాదు చేశాను. మెయిల్ చేసిన‌ట్లుగానే ఉమెన్ టీంతో నేను మాట్లాడాను. థ్యాంక్యూ.

ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా ద‌గ్గ‌ర ఉన్నాయి` అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విష‌యం తెలిసిందే. అయితే తాను పెట్టిన పోస్ట్ పై ఇటీవ‌ల పూన‌మ్ కౌర్ ఒపీనియ‌న్ పోల్ నిర్వ‌హించింది. `నేను డైరెక్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌టం నిజ‌మేన‌ని మీరు న‌మ్ముతున్నారా?.. నేను నా కోసం ఫైట్ చేయ‌డం లేదు` అంటూ ఒపీనియ‌న్‌పోల్ ని పోస్ట్ చేసింది. దీనికి నెటిజ‌న్‌ల నుంచి భారీ స్పంద‌నే ల‌భించింది. త‌ను డైరెక్ట‌ర్ త్ర‌విక్ర‌మ్‌పై చేస్తున్న ఫైట్‌ని 72 శాతం మంది స‌పోర్ట్ చేశారు.

కేవ‌లం 28 శాతం మంది మాత్ర‌మే వ్య‌తిరేకించారు. ఇన్ స్టా స్టోరీస్‌లో పూన‌మ్ పెట్టిన ఈ పోస్ట్‌కు భారీ స్పంద‌న ల‌భించ‌డంతో ఇక‌పై పూన‌మ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పూన‌మ్ కౌర్ ద‌గ్గ‌ర నిజంగానే ఆధారాలున్నాయా? ఉంటే అవి ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించే అవ‌కాశం ఉంది?..దీనిపై త్రివిక్ర‌మ్ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? అని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.