'కడప నేతల నుంచి బ్లాక్ మెయిల్'.. పూనమ్ సంచలన ఆరోపణలు..
నటి పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె.. వివిధ చిత్రాలతో అందరినీ మెప్పించారు.
By: M Prashanth | 5 Jan 2026 5:52 PM ISTనటి పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె.. వివిధ చిత్రాలతో అందరినీ మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో అలరించారు. అక్కడి నుంచి మెల్లగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా దూరంగా ఉన్నారు.
కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు పూనమ్ కౌర్. తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఆమె ఏ ట్వీట్ చేసినా, పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవ్వడం ఖాయం. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇంటర్వ్యూలో భాగంగా ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వర్గం, కీలక నేతపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలోని ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు తనను దారుణంగా వేధించారని తెలిపారు. ఒక సందర్భంలో కడపకు చెందిన కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని, నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని బెదిరించారని ఆరోపించారు.
దీంతో తనకేం మాట్లాడాలో అర్థం కాలేదని చెప్పిన పూనమ్ కౌర్.. ఆ తర్వాత ఎందుకు వచ్చారని అడగడంతో దారుణమైన విషయాలు మాట్లాడారని ఆరోపణలు చేశారు. ఓ స్టార్ హీరోపై అభాండాలు వేయాలని, విమర్శలు చేయాలని, ఆరోపణలు చేయాలని చెప్పినట్టు ఆరోపించారు. అందుకు అడిగినంత డబ్బు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు.
అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఓ పదవి ఇచ్చి హోదా కల్పిస్తామని చెప్పారట. కానీ తాను అందుకు ఒప్పుకోకపోవడంతో చాలా నీచంగా బెదిరించారని, ఆ సమయంలో తాను దేవుడిపైనే భారం వేశానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కడప నేత చేసిన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదని అన్నారు పూనమ్.
అప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే చెప్పానని తెలిపారు. అంతే కాదు.. ఒకవేళ వారు చెప్పిన యాక్టర్ కు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఆరోపణలు చేయకపోతే, న్యూ*డ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. అయినా తాను ఎప్పుడూ ఆ యాక్టర్ గురించి తప్పుగా మాట్లాడలేదని తెలిపారు.
ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎవరి కోసం అమె చెప్పారోనని అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ నటుడు ఎవరో.. ఆ రాజకీయ నేతలు ఎవరోనని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు కడప నేతలపై పూనమ్ చేసిన ఆరోపణలు అటు సినీ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
