Begin typing your search above and press return to search.

పూజాహెగ్డే ప‌క్క‌నే ఎవ‌రా అజ్ఞాత‌వాసి?

ఇంకా చెప్పాలంటే ఆఫ్ ది స్క్రీన్ లో పూజాహెగ్డే పురుషుడితో కనిపించింది కూడా ఇంత‌వ‌ర‌కూ కెరీర్ లో ఎప్పుడూ చోటు చేసుకోలేదు.

By:  Tupaki Desk   |   1 April 2024 7:23 AM GMT
పూజాహెగ్డే ప‌క్క‌నే ఎవ‌రా అజ్ఞాత‌వాసి?
X

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే పై ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి రూమ‌ర్ రాలేదు. ఏ హీరోతోనూ డేటింగ్ చేస్తున్న‌ట్లు గానీ..ల‌వ్ లో ఉన్న‌ట్లు గానీ ఇలాంటి రిలేష‌న్ షిప్ వ్యవ‌హార‌లేవి తెర‌పైకి వ‌చ్చింది లేదు. తాను ..త‌న సినిమాలు త‌ప్ప‌! మ‌రో వ్య‌వ‌హారంలో త‌ల పెట్టింది లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ మూడు భాష‌ల్లో సినిమాలు చేసింది. తెలుగు..త‌మిళ్..హిందీలో న‌టించింది గానీ ఎక్క‌డా రూమ‌ర్ల‌కు మాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు. కెరీర్ ఆరంభంలో `మోహ‌జందారో`లో హీరో హృతిక్ రోష‌న్ తో ఇంటిమేట్ స‌న్నివేశాల్లో న‌టించింది అనే త‌ప్ప‌! అంత‌కు మించి మ‌రో సినిమాలో హ‌ద్దు దాటి న‌టించింది అన్న‌ది కూడా లేదు.

ఇంకా చెప్పాలంటే ఆఫ్ ది స్క్రీన్ లో పూజాహెగ్డే పురుషుడితో కనిపించింది కూడా ఇంత‌వ‌ర‌కూ కెరీర్ లో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కానీ తొలిసారి కారులో అమ్మ‌డు ఓ పురుషిడితో క‌లిసి ప్ర‌యాణం చేస్తోన్న వీడియో ఒక‌టి లీక్ అయింది. అందులో ఇద్దరు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. దీంతో నెటి జ‌నుల్లో అప్పుడే సందేహాలు మొద‌లైపోయాయి. అత‌గాడు ఎవ‌ర‌బ్బా? అంటూ సీరియ‌స్ గా ఆలోచ‌న చేస్తున్నారు. స్నేహితుడా? సోద‌రుడా? ఎవ‌రా మిస్టీరియ‌స్ మ్యాన్? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఆ స‌న్నివేశం చూసి బుట్ట‌బొమ్మ ఏదో దాచేస్తుంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ఆ సంగ‌తేంటో తేలాలంటే పూజాహెగ్డే క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇక అమ్మ‌డి కెరీర్ గురించి తెలిసిందే. టాలీవుడ్ అవ‌కాశాల్ని కాద‌ని బాలీవుడ్ కి ఎగురుకుంటూ వెళ్లింది. కొన్ని సినిమాలు చేసింది గానీ వైఫ‌ల్యంతో ఇప్పుడు అవ‌కాశాలు క‌ష్టంగా మారాయి. మ‌ళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అవ్వాల‌ని చూస్తుంది గానీ స‌రైన ఛాన్స్ రావ‌డం లేదు.

చేతిలో మ‌రీ ఖాళీ లేకుండా హిందీలో `దేవ` అనే సినిమాకి ఇటీవ‌లే క‌మిట్ అయింది. ఆ సినిమా షూటింగ్ కి హాజ‌ర‌వుతుంది. ఈ సినిమా విజ‌యం అమ్మ‌డ‌కి కీల‌క‌మనే చెప్పాలి. ఇంత‌వ‌ర‌కూ బాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేదు. చేసిన సినిమాలేవి స‌రైన ఫ‌లితాలు సాధించని సంగ‌తి తెలిసిందే.