Begin typing your search above and press return to search.

స్విమ్ షూట్ లో బుట్ట‌బొమ్మ స‌య్యాట‌!

తాజాగా పూజా న్యూస్విమ్ షూట్ లో క‌వ్వించేస్తోన్న పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. బీచ్ లో బ్యూటీ సెగ‌లు పుట్టించే భంగిమ‌లో కెమెరాకి ఫోజులిచ్చింది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 1:49 PM GMT
స్విమ్ షూట్ లో బుట్ట‌బొమ్మ స‌య్యాట‌!
X

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బికినీ..స్విమ్ షూట్ లో అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు కాక పుట్టిస్తుంది. త‌న‌దైన మార్క్ అందాల ఎలివేన్ తో కుర్రాళ్ల‌ను ఆక‌ట్టుకుం టుంది. సొగ‌స‌రి వెకేష‌న్ కి వెళ్లిందంటే సెగ‌లు పుట్టించే స‌మ్ థింగ్ స్పెష‌ల్ ఉండాల్సిందేగా అంటుంది. ఆ హీట్ కి ఇన్ స్టా హీటెక్కాల్సిందే. ఆ రేంజ్ లో బుట్ట‌బొమ్మ బంతాట ఆడేస్తుంది.

తాజాగా పూజా న్యూస్విమ్ షూట్ లో క‌వ్వించేస్తోన్న పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. బీచ్ లో బ్యూటీ సెగ‌లు పుట్టించే భంగిమ‌లో కెమెరాకి ఫోజులిచ్చింది. చూపుల‌తో కాటేస్తుంది. అందాల‌తో ఆటాడే స్తోంది. సొగ‌సు చూడ‌త‌ర‌మా? అంటూ యువ‌త‌ని లాక్ చేస్తుంది. వైడ్ యాంగిల్ లో సొగ‌సైన వాకింగ్ స్టైల్ తో క‌ట్టి ప‌డేస్తుంది. ఆస్వాద‌న‌కు ఇది స‌రైన స‌మ‌యం అంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చేసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. బుట్ట‌బొమ్మ అభిమానులు కామెంట్ల‌తో మ‌రింత హీటెక్కిస్తు న్నారు. బికినీ ట్రీట్ సూప‌ర్బ్..ఈసారి ఇంకా కొత్త‌గా ట్రై చేయండి మేడం అంటూ ఓ అభిమాని కామెంట్ చేసాడు. ష‌రా మాములుగా ప్ర‌పోజ‌ల్స్ స్టిల్ కంటున్యూ అవుతూనే ఉన్నాయి. బుట్ట‌బొమ్మ అందాన్ని ఆస్వాదిం చడానికి రెండు క‌ళ్లు స‌రిపోవుగా అంటూ అమ్మ‌డి అందాన్ని పొగిడేస్తున్నారు.

ఇక పూజాహెగ్డే కెరీర్ సంగ‌తి చూస్తే బాలీవుడ్ పైనే ఫోక‌స్ చేసింది. తెలుగు అవ‌కాశాలు వ‌స్తున్నా! నో అంటున్న‌ట్లు వినిపిస్తుంది. గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన త‌ర్వాత ఇక్క‌డి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అప్రోచ్ అవ్వ‌డం కూడా త‌గ్గించారు. దీంతో పూర్తి స్థాయిలో బాలీవుడ్ పైనే ఫోక‌స్ పెట్టింది. కెరీర్ ఆరంభంలో వ‌చ్చిన‌ట్లు ఓ పెద్ద అవ‌కాశం కోసం ఎదురు చూస్తుంది.