Begin typing your search above and press return to search.

వీడియో: ఆ పొడుగు కాళ్ల జాత‌ర ఆప‌వ‌మ్మా

అలా ప‌డ‌వ‌లాంటి కార్ దిగి మీడియా ఎదుట‌కు న‌డుచుకుంటూ వ‌స్తున్న పూజా పొడుగు కాళ్ల సౌంద‌ర్యం మ‌తులు చెడ‌గొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2024 4:19 AM GMT
వీడియో: ఆ పొడుగు కాళ్ల జాత‌ర ఆప‌వ‌మ్మా
X

అందానికి అందం ప్ర‌తిభ ఒకే ఒర‌లో ఇమిడితే అది పూజా హెగ్డే. అందుకే ద‌శాబ్ధ కాలంగా స్టార్ హీరోయిన్ గా త‌న హోదాను కాపాడుకోవ‌డంలో స‌ఫ‌ల‌మైంది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఇప్ప‌టికీ ఒడిదుడుకులను త‌ట్టుకుని నిల‌బ‌డింది. ఇటీవ‌ల కొన్ని క్రేజీ అవ‌కాశాలు త‌న‌ని వ‌దిలి వెళ్లినా కానీ, ఇప్పుడు వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది. నిజానికి పూజా హెగ్డేకు ఇది గ్రేట్ కంబ్యాక్ అని చెప్పాలి.

మ‌రోవైపు నిరంత‌రం త‌న‌ను అనుస‌రిస్తున్న సోష‌ల్ మీడియా అనుచ‌రుల కోసం పూజా ఇస్తున్న విజువ‌ల్ ట్రీట్ మామూలుగా లేదు. తాజాగా క‌మ‌ల్ నాండ్ ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఒక‌టి మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ వీడియోలో చిట్టి పొట్టి ఫ్రాకులో పూజా హొయ‌లు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. అలా ప‌డ‌వ‌లాంటి కార్ దిగి మీడియా ఎదుట‌కు న‌డుచుకుంటూ వ‌స్తున్న పూజా పొడుగు కాళ్ల సౌంద‌ర్యం మ‌తులు చెడ‌గొడుతున్నాయి. అల వైకుంఠ‌పురములో చిత్రం కోసం ఆ పొడుగు కాళ్ల సౌంద‌ర్యంపై అద్భుత‌మైన సాహిత్యాన్ని రాసారు సినీక‌వులు. ఈ చిత్రంలో పూజా పొడుగు కాళ్ల సౌంద‌ర్యానికి ప‌డిపోయే కుర్రాడిగా బ‌న్ని క‌నిపించాడు. ఇప్పుడు తాజా వీడియోలో న‌వ్వులు చిందిస్తూనే పొడుగు కాళ్ల సౌంద‌ర్యాన్ని పొట్టి ఫ్రాకు సొగ‌సును ఆవిష్క‌రించింది పూజా. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఆ పొడుగు కాళ్ల జాత‌ర ఆప‌వ‌మ్మా! అంటూ కొంద‌రు యూత్ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మహర్షి, మృగం, మొహెంజొదారో, అల వైకుంఠపురములో వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. చివరిగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో కనిపించింది. త‌దుప‌రి దేవా, హౌస్‌ఫుల్ 5, షీ వ్యాక్స్, AA21, ఐకాన్ , గంజా శంకర్ వంటి చిత్రాలతో అల‌రించ‌నుంది. ఇవే కాకుండా అజయ్ జ్ఞానముత్తు రూప‌క‌ల్ప‌న‌లోని టెలివిజన్ సిరీస్ లోను న‌టించ‌నుంది.