Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : పూజా ఎలిమినేషన్ కారణాలు ఏంటి..?

బిగ్ బాస్ సీజన్ 7 లో ఏడో వారం ఎలిమినేషన్ పూర్తైంది. ఈ వారం కూడా హౌస్ నుంచి మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 5:19 AM GMT
బిగ్ బాస్ 7 : పూజా ఎలిమినేషన్ కారణాలు ఏంటి..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో ఏడో వారం ఎలిమినేషన్ పూర్తైంది. ఈ వారం కూడా హౌస్ నుంచి మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఈ సీజన్ 7 ఎలిమినేషన్స్ లో ఏడుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ అవడం విశేషం. ఈ వారం పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యింది. రెండు వారాల క్రితమే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన పూజా మూర్తి ఈ రెండు వారాల్లో తను టాస్కుల్లో పెద్దగా ఆడింది లేదు కానీ ఉన్నంతలో అనవసరంగా గొడవలు పడకుండా మంచిగానే ఉంది.

అయితే పూజా తో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని మధ్య లాస్ట్ వీక్ గొడవ జరిగింది. పూజా అశ్విని వీరి మధ్య అసలు పడేది కాదు. టాస్కుల్లో కూడా అశ్విని పూజాని డామినేట్ చేయాలని ప్రయత్నించింది. అయితే మొదటి వారం అశ్విని డేంజర్ జోన్ లో ఉండగా ఈ వారం ఆమె నామినేషన్స్ లో ఉన్నా సరే సేఫ్ అయ్యింది. పూజా మూర్తి మాత్రం ఎలిమినేట్ అయ్యింది. స్టార్ మా సీరియల్స్ తో పాపులర్ అయిన పూజా మూర్తి ఆ ఇమేజ్ హౌస్ లో పనికొస్తుందని భావించింది. కానీ అది అంతగా వర్క్ అవుట్ కాలేదు.

ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల ఆల్రెడీ హౌస్ లో ఉన్న వారు తమ ఆట తీరుని మార్చుకునే అవకాశం దక్కింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ముఖ్యంగా అమర్ ఆట తీరు మార్చుకున్నాడు. రెండు వారాలుగా అమర్ ఆటని హోస్ట్ నాగార్జున మెచ్చుకుంటున్నారు. పూజా మూర్తి ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్ లో తన పర్ఫార్మెన్స్ తో అలరించింది. ఇదే ఎనర్జీ ఆమె టాస్కుల్లో చూపిస్తే ఇంకొన్ని వారాలు ఉండే ఛాన్స్ ఉండేది.

బిగ్ బాస్ 7 ఆల్రెడీ 7 వారాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఇక మీదట ఎలిమినేషన్స్ అనేది టఫ్ గానే ఉంటుంది. ఆల్రెడీ స్టార్ మా బ్యాచ్ మీద మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఆవేశంగా ఉన్నారు. వారిని హౌస్ నుంచి పంపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ అనేవి చాలా కీలకం కానున్నాయి. మరి ఈ వారం అయినా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడా లేదా మళ్లీ అమ్మాయినే ఎలిమినేట్ చేస్తారా అన్నది చూడాలి. ఇక ఆల్రెడీ ఎలిమినేట్ అయిన రతిక హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె మీద ఉన్న నెగిటివిటీ ఇంకా అలానే ఉంది. ఆమె ఎంట్రీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆమె మళ్లీ నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవ్వడం పక్కా అని చెప్పొచ్చు.