Begin typing your search above and press return to search.

బీచ్‌లో కాక‌లు పుట్టిస్తున్న పూజా హెగ్డే

సూర్యుని లేలేత కిర‌ణాలు పూజా అంద‌మైన దేహ‌శిరుల్ని ట‌చ్ చేస్తుండ‌గా, విర‌బోసిన కురుల‌తో పూజా స్విమ్ సూట్ లో ప్ర‌త్యేకంగా క‌నిపించింది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:59 AM GMT
బీచ్‌లో కాక‌లు పుట్టిస్తున్న పూజా హెగ్డే
X

బికినీలు.. స్విమ్ సూట్‌ల‌తో హీటెక్కించ‌డం పూజా హెగ్డేకి కొత్తేమీ కాదు. బుట్ట బొమ్మ అంటూ తెలుగు నాట‌ కీర్తినందుకున్న పూజా అందుకు భిన్నంగా హాటెస్ట్ అవ‌తార్ ల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. గ్లామ‌రస్ హీరోయిన్ గా త‌న‌కంటూ ఒక రేంజు ఉంద‌ని నిరూపించిన పూజా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో అగ్గి రాజేస్తోంది. ఇప్పుడు త‌న 33వ పుట్టినరోజు వేళ మాల్దీవుల వెకేష‌న్ ని ఒక రేంజులో సెల‌బ్రేట్ చేస్తోంది.


ఇటీవ‌ల వ‌రుస‌గా మాల్దీవుల నుంచి పూజా హెగ్డే బోల్డ్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. మరోసారి ఐల్యాండ్ నుంచి నుంచి యూనిక్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. క్ష‌ణాల్లో ఈ ఫోటో అందరినీ చుట్టేసింది. ఈసారి పూజా మ‌రింత స్పైసీ లుక్ తో క‌ట్టి ప‌డేసింది. ఆకుపచ్చ స్విమ్‌సూట్‌లో గుబులు రేపింది. సూర్యుని లేలేత కిర‌ణాలు పూజా అంద‌మైన దేహ‌శిరుల్ని ట‌చ్ చేస్తుండ‌గా, విర‌బోసిన కురుల‌తో పూజా స్విమ్ సూట్ లో ప్ర‌త్యేకంగా క‌నిపించింది.

ఇది నిజానికి స్లీవ్‌లెస్ మోనోకినీ. పూజ టాన్డ్ స్కిన్.. దానితో పోటీప‌డుతూ న‌య‌గారా వంపులు కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. మునుప‌టితో పోలిస్తే పూజాలో హాట్ కంటెంట్ పెరిగింది అంటూ దీనిపై నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పూజా ఇటీవ‌ల టాలీవుడ్ నుంచి దూర‌మైనా కానీ, బాలీవుడ్ లో వ‌రుస చిత్రాలు చేస్తోంది. ప్ర‌స్తుతం షాహిద్ కపూర్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అధికారికంగా దీనిని ప్ర‌క‌టించారు. పూజా హెగ్డే బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీమ్ పూజాకు గ్రాండ్ వెల్ కం చెప్పింది.