Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ ఆన్ సెట్స్ కి సోలోగా..సింగిల్ గానా?

చివ‌రికి ఎలాగూ ఉన్న ప‌రిచ‌యాల‌తో మ‌ళ్లీ టాలీవుడ్ ఛాన్సులు ఒడిసిప‌ట్టు కుంటు న్న‌ట్లు క‌నిపించింది.

By:  Tupaki Desk   |   16 March 2024 7:54 AM GMT
బుట్ట‌బొమ్మ ఆన్ సెట్స్ కి సోలోగా..సింగిల్ గానా?
X

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత పూజాహెగ్డే ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిందో తెలిసిందే. తెలుగు అవ‌కాశాలు కాద‌ని మ‌రి హిందీకి వెళ్ల‌డంతో అక్క‌డ సీన్ ఒక్క‌సారిగా రివ‌ర్స్ అయింది. అవ‌కాశాలు ఇచ్చిన‌ట్లే ఇచ్చి చేతిలో ఛాన్సులు లాక్కున్న‌ట్లు క‌నిపించింది. వ‌చ్చిన అవ‌కాశాల్లో న‌టించిన అవి బాక్సాఫీస్ వ‌ద్ద నిరుత్సాన్నే మిగిల్చాయి. దీంతో చేతిలో కొత్త అవ‌కాశాలు లేక..తెలుగు ఛాన్సులు రాక ఇబ్బంది పడింది. చివ‌రికి ఎలాగూ ఉన్న ప‌రిచ‌యాల‌తో మ‌ళ్లీ టాలీవుడ్ ఛాన్సులు ఒడిసిప‌ట్టు కుంటు న్న‌ట్లు క‌నిపించింది.


కానీ దుర‌దృష్టం వెంటాడుతుంటే చేసేదేముంటుంది? క‌మిట్ అయిన ప్రాజెక్ట్ అర్దంత‌రంగా ఆగిపోవ డంతో మ‌ళ్లీ డైల‌మాలో ప‌డాల్సిన ప‌రిస్థితి క‌నిపించింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో హిందీలో `దేవ` అనే చిత్రంలో అవ‌కాశం అందుకుంది. అయితే ఈ అవ‌కాశం కూడా ఎంత‌వ‌ర‌కూ నిజ‌మో అన్న సందేహం సైతం త‌న‌లో త‌న‌కి క‌లిగింది. ఉంటుందా? ఊడుతుందా? అన్న‌ది సెట్స్ కి వెళ్లేవ‌ర‌కూ న‌మ్మ‌కం పెట్టుకున్న‌ట్లు క‌నిపించ‌న ప‌రిస్థితి. తాజాగా త‌న సంతోషాన్నంత‌టిని సోష‌ల్ మీడియా లో షేర్ చేసుకోవ‌డంతో ఛాన్స్ నిజ‌మే అని ఖ‌రారైంది.

తాజాగా `దేవ` సినిమా షూట్ లో పాల్గొన్న‌ట్లు అమ్మ‌డు రివీల్ చేసింది. రెండు రోజులుగా సెట్స్ కి వెళ్తున్న ట్లు తెలిపింది. దీంతో ఈ సినిమాలో తానే హీరోయిన్ అని మ‌రోసారి క‌న్ప‌మ్ చేసుకుంది. వ‌చ్చిన అవ‌కా శాలు చేజారిపోతే ఎలా ఉంటుందో? అమ్మ‌డికి ఇప్పుడు బాగానే అర్ద‌మైంది. షూటింగ్ లో జాయిన్ అయ్యాను? అన్న విష‌యాన్ని పూజాహెగ్డే కెరీర్ లో ఇంత వ‌ర‌కూ ఏ సినిమా విష‌యంలో చెప్ప‌లేదు.

ప్రాజెక్ట్ కి సైన్ చేసిన త‌ర్వాత గానీ...పూర్త‌యిన త‌ర్వాత గానీ చెప్పే అల‌వాటు కూడా లేదు. కానీ కొన్ని ర‌కాల అనుభ‌వాలు చాలా విష‌యాలే నేర్పిస్తాయ‌ని తెలుస్తోంది. తాజా సినిమా విష‌యంలో పూజా వెనుక మంది మార్బ‌లం ఏం లేన‌ట్లే క‌నిపిస్తుంది. ఒక‌ప్ప‌డు షూటింగ్ కి వెళ్లాలంటే ప్ర‌త్యేక ప్లైట్...వ్య‌క్తిగ‌త సిబ్బంది ఇలా చాలా హ‌డావుడే క‌నిపించేది. కానీ `దేవ` సెట్స్ కివెళ్లే ట‌ప్పుడు తాను ఒక్క‌ర్తే వెళ్లింది. `దేవా` ని షాహిద్ క‌పూర్ హీరోగా రోష‌న్ ఆండ్రూస్ తెర‌కెక్కిస్తున్నాడు.