Begin typing your search above and press return to search.

పూజా హెగ్దే అలాంటి రోల్స్ వద్దంటుందా..?

ఒక్కసారి స్టార్ రేంజ్ వచ్చాక ఆ క్రేజ్ కు తగిన సినిమాలు.. పాత్రలే ఆశిస్తారు కాబట్టి పూజా హెగ్దే కూడా అలాంటి వాటి కోసమే వెయిట్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:30 AM GMT
పూజా హెగ్దే అలాంటి రోల్స్ వద్దంటుందా..?
X

టాలీవుడ్ లో స్టార్ రేంజ్ తెచ్చుకున్న పూజా హెగ్దె సడెన్ గా తెలుగులో ఖాళీ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. గుంటూరు కారం సినిమా నుంచి బయటకు వెళ్లిన పూజా బేబీ మరో తెలుగు సినిమా ఆఫర్ అందుకోకపోవడం సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. నిన్న మొన్నటిదాకా పూజా వెంట పడ్డ దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె కాదని కొత్త హీరోయిన్స్ కోసం వెతుకుతున్నారు. ఒక్కసారి స్టార్ రేంజ్ వచ్చాక ఆ క్రేజ్ కు తగిన సినిమాలు.. పాత్రలే ఆశిస్తారు కాబట్టి పూజా హెగ్దే కూడా అలాంటి వాటి కోసమే వెయిట్ చేస్తుంది.

అయితే లేటెస్ట్ గా పూజాకి ఒక ఆఫర్ వచ్చినా కూడా చేయనని చెప్పినట్టు తెలుస్తుంది. ఒక లైలా కోసం, ముకుంద సినిమాల నుంచి చూస్తే పూజా హెగ్దే చేసిన సినిమాలన్నీ కూడా సోలో సినిమాలే మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందుకే చేస్తే సోలో హీరోయిన్ గానే చేయాలని అనుకుంటుందట. అందుకే లేటేస్ట్ గా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినా చేయనని చెప్పేసిందట.

అసలు అవకాశాలు లేని టైం లో ఏదో ఒక ఆఫర్ వచ్చింది కదా అని చేయకుండా సెకండ్ లీడ్ గా వద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. కావాలంటే రెమ్యునరేషన్ విషయంలో కాస్త హెచ్చు తగ్గులు ఓకే కానీ సోలో హీరోయిన్ గా ఒకవేళ ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మెయిన్ హీరోయిన్ గా తనని తీసుకోవాలని అంటుందట. ఆఫర్లే లేనప్పుడు పూజా ఇన్ని కండీషన్స్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

టాలీవుడ్ లో ఛాన్స్ లు లేకపోతే బాలీవుడ్ అయినా అమ్మడిని ఆదరిస్తుందా అంటే అక్కడ కూడా పూజా కి అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది. తెలుగులో అయితే ఈమధ్య కొత్త హీరోయిన్స్ జోరు ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్రెడీ పూజా హెగ్దేని చూసి చూసి ఉన్నారనే కారణం చేత ఆమెను కాకుండా వేరే హీరోయిన్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి పూజా హెగ్దే నెక్స్ట్ తెలుగు సినిమా ఏదై ఉంటుంది. ఆ లక్కీ ఆఫర్ ఎవరు ఇస్తారన్నది తెలియాల్సి ఉంది..ఆమె ఫ్యాన్స్ మాత్రం పూజా థై షో మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నారు. పూజా హెగ్దే నెక్స్ట్ తెలుగు మూవీ కోసం బుట్ట బొమ్మ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.