Begin typing your search above and press return to search.

పూజా బేబీ తగ్గదంతే..!

సౌత్ లో స్టార్డం ని ఎంజాయ్ చేస్తూ స్టార్స్ తో జత కడుతూ వచ్చిన పూజా హెగ్దే కెరీర్ సడెన్ గా డ్రాప్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   26 April 2024 8:19 AM GMT
పూజా బేబీ తగ్గదంతే..!
X

సౌత్ లో స్టార్డం ని ఎంజాయ్ చేస్తూ స్టార్స్ తో జత కడుతూ వచ్చిన పూజా హెగ్దే కెరీర్ సడెన్ గా డ్రాప్ అయిపోయింది. తనకు స్టార్ డం ఇచ్చిన టాలీవుడ్ లోనే ఆమెను ఎవరు పట్టించుకోకపోవడం జీర్ణించుకోలేకపోతుంది పూజా బేబీ. గుంటూరు కారం నుంచి బయటకు రావడమే ఆమె చేసిన పెద్ద తప్పనుకునేలా పరిస్థితి ఏర్పడింది. అటు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్దేకి పెద్దగా అవకాశాలు లేవు. ప్రస్తుతం అక్కడ షాహిద్ కపూర్ తో దేవా సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా పూర్తైతే అక్కడ ఖాళీ అయినట్టే. దేవా సినిమా కోసం కూడా పూజా హెగ్దే బాగా కష్టపడుతుందని టక్.

ఇదిలా ఉంటే కొద్దిపాటి గ్యాప్ తర్వాత పూజా బేబీకి టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అమ్మడిని సంప్రదించారట. ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాలో ప్రత్యేక గీతం కోసం బుట్ట బొమ్మని తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అయితే రాక రాక వచ్చిన ఛాన్స్ కదా పూజా ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నారు కానీ అమ్మడు మాత్రం స్పెషల్ సాంగ్ చేస్తా కానీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని అంటుందట.

సినిమాకు 3 కోట్ల దాకా తీసుకునే పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ కోసం కూడా 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని టాక్. పూజా హెగ్దే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ఫోటోలతో అమ్మడిని తెలుగు ఆడియన్స్ ఫాలో అవుతున్నారు. తెలుగులో ఆమె క్రేజ్ కొనసాగుతూనే ఉన్న కారణంగా అమ్మడు అడిగిన 2 కోట్లు ఇచ్చేందుకు ఓకే అన్నారట. దేవర సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. అనిరుద్ ఈ సాంగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట.

సో ఎన్.టి.ఆర్ తో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. వీరిద్దరు కలిసి అరవింద సమేత సినిమాలో నటించారు. తారక్ తో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయడం అంటే అది టఫ్ టాస్కే కానీ పూజా బేబీ ట్రై చేయాలని ఫిక్స్ అయ్యింది. దేవరతో మళ్లీ తెలుగులో కనిపించబోతున్న అమ్మడు ఇక మీదట ఇక్కడ ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్దే సెలెక్ట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. పూజా బేబీ తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని ఆమె అభిమానులు కూడా కోరుతున్నారు.