Begin typing your search above and press return to search.

ఆ రివ్యూవర్ కి పూజా హెగ్డే నోటీసులు..!

అయితే, ఆయన ట్వీట్ పై పూజా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   26 July 2023 6:36 AM GMT
ఆ రివ్యూవర్ కి  పూజా హెగ్డే నోటీసులు..!
X

ఉమైర్ సంధు ఈ పేరు వినే ఉంటారు. మూవీ కి రివ్యూలు ఇస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇండియాలో మూవీ విడుదల కాకముందే, మూవీ ఇలా ఉంది, అలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే, చాలా వరకు ఆయన సినిమా అద్భుతం అని చెప్పగానే, ఆ మూవీ ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక, ఆయన సినిమా బాలేదు అని రివ్యూ ఇచ్చినవి బ్లాక్ బస్టర్ అయినవీ ఉన్నాయి. ఆయన చెప్పిన రివ్యూ నిజమైన సందర్భాలు చాలా తక్కువ.

కొంత కాలం తర్వాత ఆయన రివ్యూలను అందరూ నమ్మడం మానేశారు. అయితే, ఈ మధ్య రివ్యూలు పక్కన పెట్టి, స్టార్ హీరోయిన్ల గురించి అసభ్యంగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. వారి పర్సనల్ విషయాల్లో ఎలాంటి నిజం ఉందో, లేదో తెలుసుకోకుండా కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లపై ఇలాంటి కామెంట్స్ చేశాడు.

దీనిలో భాగంగానే ఆయన ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పై కొన్ని కామెంట్స్ చేశాడు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూజా హెగ్డే నిరాశకు గురయ్యిందని, ఇటీవల ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని, అయితే, కుటుంబ సభ్యులు కాపాడారు అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చాలా దుమారం రేపింది.

అయితే, ఆయన ట్వీట్ పై పూజా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయాన్ని కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. తప్పు చేసి కూడా , ఇంత ధైర్యంగా అతను ఇలా ఎలా ట్వీట్ చేస్తున్నాడు అనే సందేహాలు అందరిలో తలెత్తడం విశేషం. నోటీసులు పంపుతున్నా కూడా అతను భయపడకపోవడం అందరినీ షాకింగ్ కి గురిచేస్తోంది.

ఇదిలా ఉండగా, ఆయన ఇటీవల అక్కినేని హీరో అఖిల్ పై కూడా ఇలానే విమర్శలు చేశాడు. అఖిల్ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతలా ను లైంగికంగా వేధించాడని కామెంట్స్ చేశాడు. అయితే, అందులో నిజం లేదని ఊర్వశి చెప్పడం విశేషం.