Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే.. కష్టకాలంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పూజా హెగ్డే స్థానంలోకి శ్రీలీల వచ్చి చేరింది

By:  Tupaki Desk   |   7 March 2024 4:42 AM GMT
పూజా హెగ్డే.. కష్టకాలంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్?
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకి ఏ ముహూర్తాన రాధేశ్యామ్ చిత్రంతో డిజాస్టర్ వచ్చిందో కానీ తరువాత చేతిలో ఉన్న అవకాశాలు అన్ని డ్రాప్ అవుతూ వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన గుంటూరు కారం సినిమా ఛాన్స్ పోయింది. పూజా హెగ్డే చేయాల్సిన క్యారెక్టర్ శ్రీలీలకి దక్కింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పూజా హెగ్డే స్థానంలోకి శ్రీలీల వచ్చి చేరింది. అలా రెండు పెద్ద సినిమాలలో ఛాన్స్ లు కోల్పోయింది. హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడీగా చేసిన సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన మిస్టర్ బచ్చన్ కోసం ముందుగా పూజా హెగ్డే పేరు వినిపించింది.

ఫైనల్ గా బాలీవుడ్ నుంచి కొత్త హీరోయిన్ ఆ ఛాన్స్ పట్టేసింది. దీంతో చివరికి రవితేజతో అనుకున్న పూజా హెగ్డేకి కలిసిరాలేదు. ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఇప్పుడు ఊహించని విధంగా మాతృభాషలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ అమ్మడుకి అవకాశం వచ్చిందని తెలుస్తోంది. కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజా హెగ్డే ఒక్క కన్నడ మూవీలో కూడా నటించలేదు.

అయితే ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేకపోవడంతో మాతృభాషలో సినిమా ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు బయటకి రాలేదు. ఈ మధ్య కన్నడ నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరోలు యూనివర్శల్ కథలని భారీ బడ్జెట్ తో చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు.

అందుకే మాతృభాష నుంచి వస్తోన్న కూడా పూజా హెగ్డే ఈ సినిమాకి ఒకే చెప్పిందని తెలుస్తోంది. త్వరలో మూవీకి సంబందించిన అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉందంట. మరి ఈ మూవీతో అయిన పూజా హెగ్డే ఫేట్ మారి మళ్ళీ అవకాశాలు క్యూ కడతాయేమో అనేది వేచి చూడాలి.