Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మకి మళ్లీ హ్యాండ్ ఇచ్చారా..?

నిన్న మొన్నటిదాకా సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ సడెన్ గా ఒక్క ఆఫర్ కూడా లేక కెరీర్ డైలమాలో పడేలా చేసుకుంది

By:  Tupaki Desk   |   12 April 2024 8:37 AM GMT
బుట్ట బొమ్మకి మళ్లీ హ్యాండ్ ఇచ్చారా..?
X

నిన్న మొన్నటిదాకా సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ సడెన్ గా ఒక్క ఆఫర్ కూడా లేక కెరీర్ డైలమాలో పడేలా చేసుకుంది. స్టార్ హీరోల సరసన ఫస్ట్ ఆప్షన్ తనే అనిపించుకున్న అమ్మడు కాస్త స్టార్ ఛాన్స్ కాదు కనీసం ఏ అవకాశం కూడా ఇవ్వలేనంతగా దూరమైంది. మొన్నటిదాకా చేతి నిండా సినిమాలతో అదరగొట్టిన అమ్మడు కాస్త ఇప్పుడు చేతిలో సినిమా లేక ఖాళీ అయ్యింది. లేటెస్ట్ గా ఒక సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉందని అనుకుంటుండగా ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా వేరే హీరోయిన్ కు దక్కిందని తెలుస్తుంది.

టాలీవుడ్ లో అన్ లక్కీ టైం కొనసాగిస్తున్న హీరోయిన్ గా బుట్ట బొమ్మ పేరు వినిపిస్తుంది. దువ్వాడ జగన్నాథం ముందు రెండు సినిమాలు చేసినా అమ్మడు వాటితో సక్సెస్ అందుకోలేదు. డీజేతో అమ్మడు ఆడియన్స్ మనసులు గెలిచింది. ఇక అప్పటి నుంచి వరుస స్టార్ సినిమాలతో దూసుకెళ్లింది. యాక్టింగ్ పరంగా సోసోగానే అనిపించినా గ్లామర్ షోలో ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేసిన పూజా హెగ్దే టాలీవుడ్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

అయితే సడెన్ గా వరుస ఫ్లాపులు ఆమె గ్రాఫ్ పడిపోయేలా చేసింది. సినిమాలు ఆడకపోవడంతో ఆమెకు ఛాన్సులు కూడా కరువయ్యాయి. మహేష్ గుంటూరు కారం నుంచి తప్పుకోవడం ఆమెను మరింత రిస్క్ లో పడేసింది. అయితే న్యాచురల్ స్టార్ నాని హీరోగా సుజిత్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో పూజా హెగ్దే నటిస్తుందని టాక్ వినిపించింది. అయితే పూజాని అనుకున్నారో లేదో కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేస్తున్నారట.

పూజా హెగ్దే దాదాపు ఫిక్స్ అనుకుంటున్న ఈ ఒక్క ఆఫర్ కూడా ఆమె చేతి నుంచి జారిపోయింది. సో టాలీవుడ్ లో పూజా బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది. రవితేజ, నాని ఇలా టైర్ 2 హీరోల సినిమాల్లో కూడా పూజాని తీసుకునేందుకు ఆసక్తి చూపించట్లేదు. అందుకే బాలీవుడ్ వైపే ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది పూజా హెగ్దే. నాగ చైతన్య హీరోగా చేస్తున్న నెక్స్ట్ సినిమాలో పూజా బేబికి ఛాన్స్ ఇస్తున్నారని టాక్ నడుస్తుంది. చైతు సినిమా ఒక లైలా కోసం సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్దే ఈ టఫ్ టైం లో మళ్లీ రెండోసారి కూడా చైతన్య సినిమా తోనే రాబోతుంది. మరి ఈ ఛాన్స్ అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.