Begin typing your search above and press return to search.

పూజా బాలీవుడ్ కెరీర్ డౌన్?

ఆస‌క్తిక‌రంగా త‌డ‌ప్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత అహన్ శెట్టి నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతో కలిసి సంకి కోసం ప‌ని చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 10:40 AM GMT
పూజా బాలీవుడ్ కెరీర్ డౌన్?
X

వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాల్లో న‌టించిన పాపుల‌ర్ హీరోయిన్ ఇప్పుడు కొత్త కుర్రాళ్ల స‌ర‌స‌న న‌టించేందుకు ఏమాత్రం భేష‌జానికి పోవ‌డం లేదు. మునుప‌టితో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా దిగి వ‌స్తోంది. దీనికి కార‌ణం త‌న మైండ్ సెట్ లో వచ్చిన మార్పు అని అంతా ఊహిస్తున్నారు. ఇండ‌స్ట్రీలో మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్‌, స‌ల్మాన్ ఖాన్, అక్ష‌య్ కుమార్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ అహ‌న్ శెట్టి లాంటి డెబ్యూ హీరో స‌ర‌స‌న న‌టించేందుకు అంగీక‌రించ‌డ‌మా?

అయినా పూజా కొత్త కుర్రాడి చిత్రానికి సంత‌కం చేసింది. సునీల్ శెట్టి న‌ట‌వార‌సుడు అహన్ శెట్టి- పూజా జంటగా న‌టించిన‌ రొమాంటిక్ డ్రామా `సంకి` ఫిబ్రవరి 2025లో విడుదల కానుంది. స‌రిగ్గా సంవత్స‌రం ప‌డుతుంది ఈ సినిమా రిలీజ్ కి రావ‌డానికి. ఆస‌క్తిక‌రంగా త‌డ‌ప్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత అహన్ శెట్టి నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతో కలిసి సంకి కోసం ప‌ని చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని శనివారం మేకర్స్ ప్రకటించారు. చిత్ర నిర్మాణ సంస్థ నదియాద్వాలా గ్రాండ్‌సన్ సంస్థ వ‌చ్చే ఏడాది వాలెంటైన్స్ డే రోజున సినిమా హాళ్ల‌ను స్వాధీనం చేసుకుంటాం.. అని ప్ర‌క‌టించారు. 14 ఫిబ్రవరి 2025న మీకు సమీపంలోని సినిమాహాళ్లలో ప్రదర్శిస్తాం అని తెలిపారు. యాసిర్‌జా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల అహాన్ 28వ పుట్టినరోజున నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ లో వ‌చ్చే నెల‌లో సినిమాని ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు.

2021లో సాజిద్ చిత్రం `తడప్`తో అహన్ శెట్టి అరంగేట్రం చేశాడు. ఈ చిత్రంలో తారా సుతారియా క‌థానాయిక‌. రజత్ అరోరా రచించారు. తొలి చిత్ర‌ దర్శకులు అద్నాన్ ఎ. షేక్ -యాసిర్ జా దర్శకత్వం వహించారు. అలాగే సాజిద్ త‌దుపరి ప్రాజెక్ట్‌లలో `హౌస్‌ఫుల్ 5` కూడా ఉంది. ఐదో భాగాన్ని తరుణ్ మన్సుఖాని డైరెక్ట్ చేయనున్నారు. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు.