Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం.. హార్ట్ బ్రేక్ మూమెంట్

ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమెకి చాలా ఇష్టమైన అమ్మమ్మ తాజాగా చనిపోయారు. దీంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 6:45 AM GMT
పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం.. హార్ట్ బ్రేక్ మూమెంట్
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియాలో నటించే స్థాయికి ఎదిగింది. ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గిన కూడా తమిళం, హిందీ భాషల నుంచి ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. గత ఏడాది లెగ్ ప్యాక్చర్ కావడంతో పూజా హెగ్డే ఇంటికే పరిమితం అయ్యింది.


ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమెకి చాలా ఇష్టమైన అమ్మమ్మ తాజాగా చనిపోయారు. దీంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. తనని ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మమ్మ చనిపోవడం చాలా బాధగా ఉందని పేర్కొంది. అమ్మమ్మతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఈ సందర్భంగా పూజా ఎమోషనల్ అయ్యింది.

అమ్మమ్మతో ఎంతో ఇష్టంతో దిగిన ఫోటోలని పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వుయ్ మిస్ యూ అజి అంటూ పూజా ఫోటోలకి కామెంట్ పెట్టింది. దీంతో పూజా హెగ్డేని ఇన్ స్టాలో ఆమె అభిమానులు ఓదార్చారు. రీసెంట్ గా పూజ హెగ్డే అక్క భూమి శెట్టి వివాహం ఘనంగా జరిగింది. ఇంతలో కుటుంబంలో ఈ విషాదం జరగడంతో పూజా తన ఆవేదనని పంచుకుంది.

ఇక ఈ ఏడాది విషాదం నుంచి వీలైనంత వేగంగా కోలుకొని పూజాహెగ్డే మరల సినిమాలతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత ఏడాది సల్మాన్ ఖాన్ కి జోడీగా కిసికా జాన్ కిసికి భాయ్ సినిమాలో పూజా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో అవకాశాలు కోల్పోయింది.

వరుసగా సినిమాలు ఫెయిల్ కావడం, అదే సమయంలో కాలికి గాయమై రెస్ట్ తీసుకోవడం, ఇంతలో అమ్మమ్మ మరణం పూజా హెగ్డే కి బ్యాడ్ టైం సూచిస్తుందని, వీలైనంత వేగంగా మరల ఆమె బ్యాక్ టూ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.