Begin typing your search above and press return to search.

45 కోట్ల కొత్త ఇంటికి మారుతున్న స్టార్ హీరోయిన్

ఇప్పుడు షాహిద్ స‌ర‌స‌న `దేవా` లాంటి క్రేజీ చిత్రంలో న‌టిస్తోంది. ఈ బిజీ స‌మ‌యంలోనే పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారబోతున్నారని తెలిసింది.

By:  Tupaki Desk   |   13 April 2024 7:53 AM GMT
45 కోట్ల కొత్త ఇంటికి మారుతున్న స్టార్ హీరోయిన్
X

కొన్ని వ‌ర‌స డిజాస్ట‌ర్లతో పూజా హెగ్డే కెరీర్ రేస్ ముగిసింది అనుకుంటుండ‌గానే, అటు ఉత్త‌రాది, ఇటు ద‌క్షిణాది రెండు చోట్లా అవ‌కాశాల ప‌రంగా పుంజుకుంటున్న తీరు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. పూజా వ‌ర‌స చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. భారీగా అడ్వాన్సులు పారితోషికాలు అందుకుంటోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌ల‌తో ఈ ఏడాది అభిమానుల‌ను అల‌రించ‌నుంది.

ఇప్పుడు షాహిద్ స‌ర‌స‌న `దేవా` లాంటి క్రేజీ చిత్రంలో న‌టిస్తోంది. ఈ బిజీ స‌మ‌యంలోనే పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారబోతున్నారని తెలిసింది. సముద్రానికి ఎదురుగా ఉన్న 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అపార్ట్ మెంట్ లోకి దిగుతోంది. దీని ఖ‌రీదు 45 కోట్లు. ఈ కొత్త ఆస్తి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. బాంద్రా అన‌గానే బాలీవుడ్ అగ్ర తార‌లంతా కొలువుండే చోటు అని వెంట‌నే గుర్తిస్తారు. అలాంటి చోట త‌న స్టాట‌స్ ని చూపించేందుకు పూజా ప్ర‌య‌త్నిస్తోంది.

ఇక ఈ ఇంటికి ఇంటీరియ‌ర్ స‌హా డిజైనింగ్ ప‌రంగా వ‌ర‌ల్డ్ క్లాస్ లో వ‌ర్క‌వుట్ చేస్తోంద‌ని స‌మాచారం. ఒక సోర్స్ ప్ర‌కారం..పూజా హెగ్డే 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన సీఫేసింగ్ అపార్ట్ మెంట్ లోకి మారుతున్నారు. అద్భుత‌మైన విజువ‌ల్ బ్యూటీ ఉన్న ఇల్లు ఇది. అన్ని విధాలా సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌దేశంలో ఇది ఉంది.

అంతకుముందు పూజ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. గోవా నుంచి వ‌రుస ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా ఇవి.. 26.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను అల‌రించాయి. పూజా పూల్ సైడ్ ట్రీట్ అభిమానుల హృద‌యాల‌ను తాకింది. పూజా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... షాహిద్ తో `దేవా` కాకుండా సాంకి అనే చిత్రంతోను బిజీగా ఉంది. మూడు ప్రధాన దక్షిణ భారత సినిమాల్లో న‌టిస్తోంది.