Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్ లో బంపరాఫర్లు!

పూజా హెగ్డే.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   18 March 2024 1:30 PM GMT
పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్ లో బంపరాఫర్లు!
X

పూజా హెగ్డే.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్ల తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ బాగా తగ్గిపోయాయి. ఆ తర్వాత మహేశ్ బాబు గుంటూరు కారంతోపాటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆమెనే తప్పుకుంది. రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మళ్లీ అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.


పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్, పూజ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న సినిమాలో కూడా పూజకు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నా.. ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. అయితే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న తర్వాత బాలీవుడ్ పై దృష్టి పెట్టింది పొడుగు కాళ్ళ సుందరి. సౌత్‌ లో అవకాశాలు తగ్గడంతో నార్త్ పై ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో అవకాశాల కోసం ట్రై చేస్తూనే.. ఉత్తరాదిలో అందిపుచ్చుకుంటోంది. బీ టౌన్ లో వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతోంది.

ఇటీవల బాలీవుడ్ మూవీ దేవా సెట్స్ లోకి అడుగుపెట్టింది పూజ. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ ఇప్పటి వరకు కనిపించని రోల్ లో సందడి చేయనుంది. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ లో ఇటీవల పాల్గొంది. ఓ యువ పోలీసు అధికారి కేసును దర్యాప్తు చేసే సమయంలో ఎదురైన సవాళ్ల చుట్టూ తిరిగే స్టోరీతో రూపొందుతున్న సినిమాలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది.

మరోవైపు, దేవాతో పాటు కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న కొత్త మూవీలో ఆమె ఛాన్స్ దక్కించుకుంది. అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న సంకీలోనూ హీరోయిన్‌ గా ఎంపికైంది. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుందీ చిత్రం. గతేడాది కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ సినిమాతో హిందీ ఆడియన్స్ ను పలకరించింది. మరి పూజా హెగ్డే నటిస్తున్న కొత్త చిత్రాలు ఆమెకు ఎలాంటి హిట్లు తెచ్చిపెడతాయో చూడాలి.