Begin typing your search above and press return to search.

ఆ పంతుల‌మ్మ వేషాలేంటి మ్యాడ‌మ్!

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   31 March 2024 11:30 AM GMT
ఆ పంతుల‌మ్మ వేషాలేంటి మ్యాడ‌మ్!
X

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టికప్పుడు హాట్ ఫోటోలే కాదు రేర్ గా ఫ‌న్నీ వీడియోల‌తో అంతే స‌ర‌దాని పంచుతుంటుంది. ఇన్ స్టా వేదిక‌గా స్టైలిష్ వీడియోల్ని సైతం షేర్ చేసి సంథింగ్ స్పెష‌ల్ గా నిలుస్తుంటుంది. తాజాగా అమ్మ‌డు అలాంటి వీడియోతో ముందుకొచ్చింది. షూట్ మ‌ధ్య‌లో చిలౌట్ మూవ్ మెంట్ అంటూ ఇలా అల‌రించింది. ఇందులో పూజా హెగ్డే ఒక టీచర్‌లా నటించడం ఇంట్రెస్టింగ్..బోర్డ్ పై సీరియ‌స్ గా క్లాసులు చెబుతోన్న బ్యూటీని చూడొచ్చు.


గ‌ణితం..ఇత‌ర స‌బ్జెక్ట్ లు బోధించే టీచ‌ర్ లా అంద‌మైన చిరున‌వ్వుతో యువ‌త‌ని అల‌రించింది. RTGS (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) కాన్సెప్ట్‌ను సరదాగా ఇలా ట‌చ్ చేసింది. `ఇది ఏమిటో నాకు కూడా తెలియదు` అంటూనే హాస్యంతో కూడిన క్యాప్షన్‌తో హెగ్డే బ్లూపర్స్‌తో నిండిన రోజుగా చెప్పుకొచ్చింది. షూటింగ్ షెడ్యూల్ మ‌ధ్య‌లో స‌మయం దొర‌క‌డంతో ఇలా ఇన్ స్టా అభిమానుల్ని అల‌రించ‌డానికి ఈ వీడియో చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి జోష్ కి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. అంద‌మైన ఫోటోల‌తోనే కాదు...స‌ర‌దా వీడియోల‌తో మా హృద‌యాల్ని దోచేస్తున్నావ్ అంటున్నారు. మ‌రికొంత మంది పూజాహెగ్డే ఏంటి? ఇలా పంతుల‌మ్మ అయిపోయింద‌ని అంతా న‌వ్వేస్తున్నారు. ఇక పూజాహెగ్డే కెరీర్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకుంటుంది. ఇప్ప‌టికే దేవా అనే సినిమాకి సైన్ చేసింది.

ఇప్ప‌టికే ఈ సినిమా షూట్ లో పాల్గొంటుంది. అలాగే `హౌస్‌ఫుల్ -5` -`షీ వాక్స్` వంటి క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది. ఇవి గ‌నుక సక్సెస్ అయితే పూజాహెగ్డే బాలీవుడ్ కెరీర్ ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లే. అలాగే అమ్మ‌డు తెలుగులోనూ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుంది. సీరియ‌స్ గా త‌న‌వైపు నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఓ సినిమాకి సైన్ చేసినా అనివార్యకార‌ణాల‌తో అది డిలే అవుతోంది.