Begin typing your search above and press return to search.

ఇక్కడ మిస్సైనా అక్కడ ఛాన్స్ అందుకున్న బుట్ట బొమ్మ..!

బాలీవుడ్ స్టార్ షాహిద్ సరసన ఛాన్స్ అంటే పూజా లక్కీ ఆఫర్ కొట్టేసినట్టే లెక్క అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 12:30 AM GMT
ఇక్కడ మిస్సైనా అక్కడ ఛాన్స్ అందుకున్న బుట్ట బొమ్మ..!
X

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ ఖాళీ చేసింది. ఉన్న ఒక్క ఛాన్స్ కాస్త చేజారే సరికి అమ్మడికి ఇక్కడ అవకాశాలు లేకుండాపోయాయి. ఈ క్రమంలో పూజా హెగ్దే సినిమా అప్డేట్స్ కోసం ఆమె ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ లో మాత్రం అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ తో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా చేసిన పూజా హెగ్దే ఆ సినిమా తో కూడా ఫెయిల్యూర్ అయ్యింది.


తెలుగులో ఆఫర్లు లేవు బాలీవుడ్ లో సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఈ టైం లో పూజా చాలా ఇబ్బందిగా ఫీలైనట్టు తెలుతుంది. అయితే లేటెస్ట్ గా అమ్మడికి లక్కీ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్న దేవా సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను రోషన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ సరసన ఛాన్స్ అంటే పూజా లక్కీ ఆఫర్ కొట్టేసినట్టే లెక్క అని చెప్పొచ్చు.

ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ సినిమా నుంచి కొన్ని స్టిల్స్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది పూజా. సినిమాలో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. సౌత్ లో పెద్దగా అవకాశాలు లేకపోయినా పూజా బేబ్ బాలీవుడ్ లో మాత్రం క్రేజీ ఆఫర్ కొట్టేసింది. అయితే ఇదంతా అమ్మడు సోషల్ మీడియా ప్రభావమే అని అంటున్నారు.

సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్న పూజా బేబీ గ్లామర్ షోతో దుమ్ము దులిపేస్తుంది. తెలుగులో అయితే రాసుకున్న పాత్రకు ఆమె పర్ఫెక్టా కాదా అని చూస్తారు కానీ బీ టౌన్ ఆఫర్ అంటే హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్ అందిస్తే చాలు.

సో ఆ విషయంలో పూజా గ్రాఫ్ బాగానే ఉంది కాబట్టి అమ్మడికి ఈ ఛాన్స్ వచ్చింది. తప్పకుండా పూజా షాహిద్ దేవాతో బాలీవుడ్ లో మరోసారి తన మ్యాజిక్ చూపించాలని చూస్తుంది. మరి బాలీవుడ్ ఆడియన్స్ పూజా మాయలో పడతారా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ రిలీజ్ లాక్ చేశారు.