Begin typing your search above and press return to search.

లో దుస్తులో పూజాభ‌లేక‌ర్ హాట్ హాట్ గా

లేడీ బ్రూస్లీ పేరుతో కల్లోలమే ఇది అనేలా ఈ సినిమా విజువల్స్ ఓ రేంజ్ లో వెడెక్కించాయి.

By:  Tupaki Desk   |   24 Jan 2024 3:00 AM GMT
లో దుస్తులో పూజాభ‌లేక‌ర్ హాట్ హాట్ గా
X

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `ల‌డ్కీ` సినిమాతో పాపుల‌ర్ అయిన హాట్ బ్యూటీ పూజా భ‌లేక‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డితో మార్ష‌ల్ ఆర్స్ట్ నేప‌థ్య గ‌ల సినిమా తీసి పెద్ద సంచ ల‌నమే సృష్టించాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యమే అయినా అమ్మాయిని ఇంచి ఇంచి కొలతలు కొలిచి మరీ ఒంపుసొంపుల్ని రంగరించి డ్కీలో చూపించాడు. అసలు ఆర్జీవీ లెన్సే వేరు.. ఆయన సెన్సే వేరు! ఆ కళ్లలోంచి కథానాయికను చూసే తీరే వేరు! అనిపించక మానదని ల‌డ్కీ తో మ‌రోసారి నిరూపించాడు.


లేడీ బ్రూస్లీ పేరుతో కల్లోలమే ఇది అనేలా ఈ సినిమా విజువల్స్ ఓ రేంజ్ లో వెడెక్కించాయి. ఆ సినిమాలో బికినీ ఫోటోలు నెట్టింట అదే రేంజ్ లో దుమారం రేపాయి. అప్ప‌టి నుంచి పూజా ఎక్క‌డ ఎలా క‌నిపించినా అక్క‌డ సంచ‌ల‌నం త‌ప్ప‌రిస‌రైంది. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోని షేర్ చేసి ఇన్ స్టాలో సెగ‌లు పుట్టించింది. ఇదిగో ఇక్క‌డిలా లో దుస్తులో పూజాభ‌లేక‌ర్ హాట్ హాట్ గా చెల‌రేగింది.


చిల‌కాకు ప‌చ్చ లో దుస్తుల‌లో పూజా ఆవిష్క‌రించిన తీరుకు యువ‌త‌లో స‌లప‌రం మొద‌ల‌వ్వ‌డం ఖాయం. అమ్మ‌డు ఆ రేంజ్ స్కిన్ షోతో రచ్చ చేసింది. గుడుంబా శంక‌ర్ స్టైలో జీన్స్ ప్యాట్ ముందు బ‌ట‌న్ ఓపేన్ చేసి లోప‌ల అందాల్ని షూట్ కోసం వ‌దిలేసింది. టాప్ లో పీస్ అంతే ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఇలా ముస్తాబై బ‌య‌ట‌కు వెళ్లే ముందు సెల్పీ దిగింది. ఇలాంటి దుస్తుల్లో ఓ 1000 సార్లు ఫోటో సెల్పీ దిగినా త‌ప్పేం లేదు అంటూ ల‌వ్ సింబ‌ల్ ఎమోజీని పోస్ట్ చేసింది.


ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కుర్రాళ్ల కామెంట్ల‌కైతే అడ్డు అదుపులేదు. ఎవ‌రి స్టైల్లో వారు చెల‌రేగుతున్నారు. అమ్మ‌డిలో ఈ యాంగిల్ చూసే క‌దా ల‌డ్కీ సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు. త‌న‌ని ఎలా జ‌నాల్లోకి వద‌లితే సంచ‌ల‌నమ‌వుతుందా? ప‌క్కాగా ప్లాన్ చేసుకుని మరీ వ‌దిలాడు. కానీ పూజాకి అటుపై పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ ఉన్నా అది అక్క‌డికే ప‌రిమిత‌మైంది.