పూజా హెగ్దేకి అదృష్టం పట్టినట్టేనా..?
విజయ్ సినిమా తర్వాత ధనుష్ నెక్స్ట్ సినిమాలో కూడా బుట్ట బొమ్మ లక్కీ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 4 July 2025 9:35 PM ISTబుట్ట బొమ్మ పూజా హెగ్దేకి సౌత్ లో అవకాశాలు లేవు లేవు అనుకుంటూ ఉన్నారు. తెలుగులో ఆమెకు ఆఫర్లు లేవు కానీ అమ్మడికి తమిళంలో మాత్రం వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. పూజా హెగ్దే ప్రస్తుతం దళపతి విజయ్ తో జన నాయగన్ సినిమా చేస్తుంది. విజయ్ తో ఆల్రెడీ బీస్ట్ సినిమాలో నటించింది పూజా హెగ్దే. మళ్లీ జన నాయగన్ తో ఆ ఛాన్స్ అందుకుంది.
విజయ్ సినిమా తర్వాత ధనుష్ నెక్స్ట్ సినిమాలో కూడా బుట్ట బొమ్మ లక్కీ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ కి జతగా పూజా బేబీ నటిస్తుంది. విజయ్ తో సినిమా ఆ నెక్స్ట్ ధనుష్ తో ఛాన్స్ పూజా హెగ్దేకి కోలీవుడ్ లక్కీగా మారింది.
ఇక ఇదే కాదు కాంచన 4 లో కూడా పూజా హెగ్దే చేస్తుంది. అది ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఆల్రెడీ సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది పూజా హెగ్దే. ఆ సాంగ్ తోనే పూజా క్రేజ్ పెరుగుతుందని భావిస్తుండగా ఇప్పుడు వరుస అవకాశాలు ఆమెను మరింత చర్చల్లో ఉంచేలా చేసింది.
పూజా హెగ్దేకి తప్పకుండా ఈ అవకాశాలు మళ్లీ ఆమె కెరీర్ ని సరైన ట్రాక్ లోకి పెట్టేలా చేస్తాయని చెప్పొచ్చు. తెలుగులో స్టార్ రేంజ్ సంపాధించిన టైంలో తమిళ్ లో పెద్దగా అవకాశాలు రాబట్టలేని తెలుగులో ఛాన్స్ లు రాకపోయినా సరే తమిళ్ లో మాత్రం ఆమె బీభత్సమైన ఫాంలో ఉంది.
రీసెంట్ గా అమ్మడు సూర్య హీరోగా నటించిన రెట్రో లో నటించింది. ఆ సినిమాలో పూజా బేబ్ డీ గ్లామర్ లుక్ తో కనిపించింది. ఐతే ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా పూజాకి మాత్రం కోలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చేలా చేస్తున్నాయి.
పూజా హెగ్దే గ్లామర్ షో చేస్తే ఆ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఐతే స్కిన్ షో తో ఎంతోకాలం కెరీర్ నిలబడదని కనిపెట్టిన పూజా హెగ్దే ఫైనల్ గా నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా అదే తరహాలో వస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే వీటిలో ఏ సినిమా సూపర్ హిట్ అయినా పూజా హెగ్దే కి తమిళ్ లో మళ్లీ మళ్లీ అవకాశాలు తెచ్చేలా చేస్తాయని చెప్పొచ్చు.
