Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : అందాల బ్యూటీ బార్బెక్యూ ట్రీట్‌

సినిమాలతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండే పూజా హెగ్డే తాజాగా తన ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 3:39 PM IST
పిక్‌టాక్‌ : అందాల బ్యూటీ బార్బెక్యూ ట్రీట్‌
X

టాలీవుడ్‌లో దశాబ్ద కాలం క్రితం ముకుందా, ఒక లైలా కోసం సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి అల్లు అర్జున్‌తో 'డీజే' సినిమాలో నటించే అవకాశం దక్కింది. మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా, సాంప్రదాయబద్దంగా కనిపించిన పూజా హెగ్డే డీజే సినిమాలో మాత్రం దుమ్ము దులిపేసింది. బికినీ ట్రీట్‌తో పాటు, హీరోతో రొమాంటిక్ సీన్స్, స్కిన్‌ షో ఇలా అన్నింటిని డీజే సినిమాలో చూపించడం ద్వారా అభిమానులను సొంతం చేసుకుంది. డీజే సినిమాలో ఈమె పోషించిన పాత్రతో టాలీవుడ్‌లో ఒకే సారి బిజీ అయింది. దాదాపు ఐదు.. ఆరు ఏళ్ల పాటు బిజీ బిజీగా మారింది. వరుస సినిమాలు చేసింది.


తెలుగులోని దాదాపు అందరు యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేయడం ద్వారా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌.. నటన పరంగా మంచి మార్కులు దక్కించుకున్న పూజా హెగ్డే తక్కువ సమయంలోనే ఎక్కువ పెద్ద సినిమాలు చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈమె సినిమాలు చేసింది. తెలుగులో ఈమె హీరోయిన్‌గా ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. కానీ ఇతర భాషల్లో ఈ అమ్మడు నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. తెలుగులో రీ ఎంట్రీ కోసం తాపత్రయం చూపుతున్న పూజా హెగ్డేకు తిరిగి ఆఫర్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడు బిజీగా ఉంది.

సినిమాలతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండే పూజా హెగ్డే తాజాగా తన ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసింది. సన్నిహితులతో కలిసి వెజ్ బార్బెక్యూ ట్రీట్‌ను ఎంజాయ్‌ చేసింది. చెఫ్‌ ప్రహ్లాద్‌ హెగ్డేతో కలిసి అంటూ ఈ ఫోటోను షేర్‌ చేసింది. ఫోటోలో పూజా హెగ్డే చాలా ఉల్లాస భరితంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. సన్నిహితులతో పూజా హెగ్డే ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. ఈ అందాల బ్యూటీ బార్బెక్యూ ట్రీట్‌ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించడం తో పాటు, ఫోటోలో ఉన్నది ఎవరు అంటూ చర్చకు తెర తీసింది.

ఈ ఏడాది ఇప్పటికే పూజా హెగ్డే నటించిన హిందీ మూవీ దేవా, తమిళ్‌ మూవీ రెట్రో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అయినా కూడా తమిళ్‌లో ఈమె ప్రత్యేక పాటలో నటించిన కూలీ సినిమాతో పాటు కాంచన 4 సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. మరో వైపు హిందీలో కూడా రెండు మూడు సినిమాలు చేస్తుంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే పూజా హెగ్డే తెలుగులో కూడా ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలో పూజా హెగ్డే యంగ్‌ స్టార్‌ హీరోతో రొమాన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.