Begin typing your search above and press return to search.

మినీ డ్రెస్ స‌రే..హ్యాండ్ బ్యాగ్ ధ‌ర‌ రూ. 3.20ల‌క్ష‌లు

పూజా హెగ్డే తన తాజా పార్టీ లుక్ స్నాప్‌లను ఇన్‌స్టాలో అందంగా పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   31 March 2025 9:22 AM IST
మినీ డ్రెస్ స‌రే..హ్యాండ్ బ్యాగ్ ధ‌ర‌ రూ. 3.20ల‌క్ష‌లు
X

అందానికి అందం ప్ర‌తిభ‌తో పూజా హెగ్డే ద‌శాబ్ధం పైగానే కెరీర్ బండిని స‌జావుగా సాగించింది. ఇటీవ‌ల కొన్ని అవ‌కాశాలు చేజారుతున్నా కానీ, తిరిగి కంబ్యాక్ అవుతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. పూజా న‌టించిన యాక్ష‌న్ డ్రామా దేవా (షాహిద్) ఓటీటీలో స్ట్రీమింగుకి వ‌చ్చింది. ఇంత‌లోనే ప్ర‌చారంలో బిజీగా ఉన్న‌ పూజా ఇదిగో ఇలా కొత్త లుక్కుతో నెటిజ‌నుల‌ను క‌వ్వించింది.


ఈసారి ఫ్లోర‌ల్ బొటానిక్ ప్రింటెడ్ గౌనులో బుట్ట బొమ్మ‌ ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది సమ్మ‌ర్ స్పెష‌ల్ డ్రెస్. గింగ్‌హామ్ ప్రింట్ తో 1930ల నుండి జెంజ్ ఫ్యాషన్‌వాదుల్లో చ‌ర్చ‌గా మారిన వింటేజ్ లుక్ ఇది, ఎ-లిస్టర్ పూజా హెగ్డే ఈ ఎంపిక అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా పూజా అందమైన మినీ డ్రెస్‌ను స్టైల్ చేసిన విధానం ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ డ్రెస్ లో పూజా టోన్డ్ బాడీ అందంగా ఎలివేట్ అవుతోంది. ఇక ఈ మినీ డ్రెస్‌లో పూజా భంగిమ‌లు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి.


పూజా హెగ్డే తన తాజా పార్టీ లుక్ స్నాప్‌లను ఇన్‌స్టాలో అందంగా పోస్ట్ చేసింది. ఈ డ్రెస్‌లో అల్టిమేట్ ఐటీ-గర్ల్ వైబ్‌ను వైర‌ల్ చేసింది. మినీ డ్రెస్ ని ఎలివేట్ చేస్తూ టాప్ యాంగిల్ షాట్‌లతో ఫోటోషూట్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. పూజా ప‌ర్ఫెక్ట్ గింగమ్ మినీ డ్రెస్ తో రూ. 3,19,000 విలువైన ప్రాడా బ్యాగ్ ని ధ‌రించి క‌నిపించింది. ఈ లుక్ కోసం పూజా హెగ్డే తెల్లటి సాక్స్ తో బ్లాక్ లోఫర్స్ ని ధరించింది. పూజా ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న జ‌న‌నాయ‌గ‌న్ చిత్రంలో న‌టిస్తోంది. రెట్రో, కాంచ‌న 4 లాంటి చిత్రాల్లోను పూజా అవ‌కాశాలు అందుకుంది. ఓ హిందీ చిత్రంలోను న‌టిస్తోంది.