వాళ్లంతా నా నిజమైన ఫ్యాన్స్ కాదు!
సోషల్ మీడియాలో ఉండే హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే హీరోల కంటే కూడా హీరోయిన్లకే ఎక్కువ ఫాలోవర్లు ఉంటారు.
By: Tupaki Desk | 19 April 2025 10:40 PM ISTతెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. కానీ వరుస ఫ్లాపులు అమ్మడికి అవకాశాలను తగ్గించేశాయి. దీంతో చేసేది లేక బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించిన పూజాకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగలడంతో తిరిగి సౌత్ కు వచ్చి ఇక్కడ ఛాన్సుల కోసం తెగ ప్రయత్నించింది బుట్టబొమ్మ.
ప్రస్తుతం తమిళంలో పూజా చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒకటి విజయ్ తో చేస్తున్న జననాయగన్ కాగా, రెండోది సూర్యతో చేసిన రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో మే 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. వీటితో పాటూ రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది పూజా.
అవే కాకుండా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కాంచన4లో కూడా పూజా నటించబోతుందని వార్తలొస్తున్నాయి. వీటన్నింటిలో రెట్రో, జననాయగన్ సినిమాలపై పూజా చాలానే ఆశలు పెట్టుకుంది. రెట్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సోషల్ మీడియాలోని ఫాలోవర్లపై కామెంట్స్ చేసింది.
సోషల్ మీడియాలో ఉండే హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే హీరోల కంటే కూడా హీరోయిన్లకే ఎక్కువ ఫాలోవర్లు ఉంటారు. అలా బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కూడా 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయంపై పూజా మాట్లాడుతూ తనకు సోషల్ మీడియాలో ఎందరో స్టార్ హీరోల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని, కానీ వాళ్లంతా తన నిజమైన ఫ్యాన్స్ కారని పూజా తెలిపింది.
ఆమె ఫాలోవర్లు అందరూ థియేటర్లలో తన సినిమాలు చూడరని, సోషల్ మీడియా వేరు, ఫ్యానిజం వేరని పూజా వ్యాఖ్యలు చేసింది. తనతో పాటూ చాలా మంది హీరోయిన్లకు కూడా భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారని, వాళ్లు కూడా నిజమైన ఫ్యాన్స్ అని తాను అనుకోవడం లేదని, సోషల్ మీడియాలో చూసేది నిజమైన ప్రపంచం కాదని పూజా తెలిపింది. పూజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
