Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌ని గ‌ట్టెక్కించేది ఆ ఇద్ద‌రేనా?

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కొంత మంది క్రేజ్ ఎంత రాకెట్ స్పీడుతో పెరుగుతుందో అంతే స్పీడుగా ప‌డిపోతుంటుంది.

By:  Tupaki Desk   |   4 May 2025 8:00 AM IST
బుట్ట‌బొమ్మ‌ని గ‌ట్టెక్కించేది ఆ ఇద్ద‌రేనా?
X

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కొంత మంది క్రేజ్ ఎంత రాకెట్ స్పీడుతో పెరుగుతుందో అంతే స్పీడుగా ప‌డిపోతుంటుంది. ఇలియానా, శ్రీ‌లీల ఇప్పుడు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. ఈ ముగ్గురు టాలీవుడ్‌లో ఎంత స్పీడుగా ఎదిగారో అంతే స్పీడుగా ఫ్లాపుల్ని ఎదుర్కొన్నారు. ఇప్ప‌టికీ ఎదుర్కొంటున్నారు. దానికి కార‌ణం వారు ఎంచుకున్న సినిమాలే. ఇలియాన రాకెట్ స్పీడుతో ఎదిగి అంతే స్పీడ్‌తో తెర‌మ‌రుగైపోయింది. ఇప్పుడు ఆ ప‌రిస్థితిని బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే ఎదుర్కొంటోంది.

`డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం` మూవీతో బిగ్ డైరెక్ట‌ర్ల దృష్టిని ఆక‌ర్షించిన పూజా హెగ్డే అన‌తికాలంలోనే వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచింది. బ‌న్నీ అల‌వైకుంఠ‌పురం` వ‌ర‌కు అదే హ‌వాని కొన‌సాగిస్తూ భారీగా డిమాండ్ చేసిన పూజా హెగ్డే ఆ త‌రువాత నుంచి వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ కెరీర్ ప‌రంగా ఎదురీదుతోంది. రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య‌, బాలీవుడ్‌లో స‌ర్క‌స్‌, కిసీకి భాయ్ కిసీకి జాన్‌, దేవ వంటి సినిమాల‌తో వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొని షాక్ ఇచ్చింది.

ఈ సినిమాల‌తో పూజా హెగ్డే వ‌రుస‌గా రికార్డు స్థాయిలో 7 ఫ్లాపుల్ని ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా సూర్య‌, కార్తీక్ సుబ్బ‌రాజ్‌ల `రెట్రో`తోనూ ఫ్లాప్‌ని ఎదుర్కోవ‌డంతో బుట్ట‌బొమ్మ కెరీర్ ఇక అంతేనా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పూజా హెగ్డేకు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో అవ‌కాశాలు త‌గ్గే అవ‌కాశం ఉంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త‌న‌ని, త‌న కెరీర్ ని కాపాడేది ఆ ఇద్ద‌రే అనే చ‌ర్చ మొద‌లైంది. ఆ ఇద్ద‌రు ద‌ళ‌ప‌తి విజ‌య్‌, రాఘ‌వ లారెన్స్‌.

విజ‌య్ త‌న చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` చేస్తున్న విష‌యం తెలిసిందే. హెచ్‌.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజ‌య్‌కి జోడీగా బుట్ట‌బొమ్మ న‌టిస్తోంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా ఫ‌లితంపైనే పూజా హెగ్డే కెరీర్ ఆధార‌ప‌డి ఉంది. ఇక ఈ మూవీ త‌రువాత పూజా హెగ్డే హార‌ర్ థ్రిల్ల‌ర్ `కాంచ‌న 4`లో న‌టిస్తోంది. `కాంచ‌న‌` ఫ్రాచైజీలో భాగంగా రాఠ‌వ లారెన్స్ రూపొందిస్తున్న ఈ మూవీ కూడా పూజా హెగ్డేకు కీల‌కంగా మారింది. తొలి సారి త‌ను చేస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ కావ‌డం, కాంచ‌న సీక్వెల్ కావ‌డంతో అంద‌రి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై ప‌డింది. బుట్ట‌బొమ్మ‌కు ఈ రెండు సినిమాలు హిట్ ని అందిస్తే మ‌రిన్ని సినిమాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. లేదంటే ఇక కెరీర్ ముగిసిన‌ట్టే అని ఇన్ సైడ్ టాక్‌.