రీసెంట్ గా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు 'పూజ' పాటతో ఫుల్ వైరల్!
అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల.. 'మోనికా బెలూచీ... ఎర్రంగి వందాచీ...' సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మన బుట్టబొమ్మ పూజా హెగ్డే తనదైన డ్యాన్స్ తో అదరగొట్టారు.
By: Tupaki Desk | 14 July 2025 9:00 AM ISTస్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీలో స్పెషల్ సాంగ్ తో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఆగస్టు 14వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పింది.
మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినీ ప్రియులు, ఫ్యాన్స్.. మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల.. 'మోనికా బెలూచీ... ఎర్రంగి వందాచీ...' సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మన బుట్టబొమ్మ పూజా హెగ్డే తనదైన డ్యాన్స్ తో అదరగొట్టారు.
పోర్ట్ ఏరియాలో సాంగ్ పిక్చరైజ్ చేయగా.. అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్ తో మెప్పించారు. ఫుల్ గ్రేస్ తో ఎనర్జీ లెవెల్స్ పెంచేలా తన వర్క్ తో అలరించారు. సుభాషిణితో కలిసి ఆలపించారు కూడా. ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది.
అదే సమయంలో సాంగ్ లో ఇప్పుడు పూజా హెగ్డేతో మాలీవుడ్ యాక్టర్ సాబిన్ షాహిర్ వేసిన స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మోనికా ఐ లవ్ యూ అంటూ ఫుల్ ఎనర్జీతో ఆయన చేసిన డ్యాన్స్ వేరే లెవల్‌లో ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ లుక్ లో కనిపిస్తూనే అదిరిపోయేలా ఆయన వేసిన స్టెప్పులు మెప్పిస్తున్నాయి.
దీంతో ఆయన కోసం తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రీసెంట్ గా మాలీవుడ్ తో పాటు డబ్ అయిన భాషల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ లో సాబిన్ యాక్ట్ చేసి మెప్పించారు. సహ నిర్మాతగా వ్యవహరించి.. లాభాలు కూడా అందుకున్నారు. ఇప్పుడు పూజా హెగ్డే సాంగ్ తో వైరల్ గా మారారు.
బాల నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించిన సాబిన్.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు. ప్రేమమ్, చార్లీ అన్నయుమ్ రసూలం వంటి ప్రముఖ చిత్రాల్లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. సుడాని ఫ్రమ్ నైజీరియా మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు కూడా అందుకున్నారు. మంజుమ్మల్ బాయ్స్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు కూలీ మూవీ స్పెషల్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.
