కూలీ: సౌండ్ పెంచేలా పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్
ఈ పాట చిత్రం నుండి రెండో సింగిల్ కావడం, మోనికా పాత్రకు ప్రత్యేకంగా ఈ లుక్ రివీల్ చేయడం చూస్తే.. సినిమాలో పూజా పాత్ర ఓ స్పెషల్ యాడిషన్ అని తెలుస్తోంది.
By: Tupaki Desk | 10 July 2025 3:14 PM ISTరజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ 'కూలీ'పై ఎప్పుడో మొదలైన హైప్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, మ్యూజికల్ బిట్, స్టార్ క్యాస్టింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ మ్యూజిక్, అన్బరివ్ యాక్షన్ మాస్టర్స్ హ్యాండిల్ చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్ లాంటి తారాగణం ఉన్నప్పటికీ, ఇప్పుడు మరో క్రేజీ సాంగ్ కు సంబంధించిన అప్‌డేట్ వైరల్ అవుతోంది. అదే.. 'మోనికా' అనే సాంగ్. ఈ పాటలో గ్లామరస్ గర్ల్ పూజా హెగ్డే స్పెషల్ గా హైలెట్ కానుంది. ఈ సందర్భంగా 'మోనికా' అంటూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
పోస్టర్‌లో పూజా హెగ్డే ఎర్ర గౌన్‌లో గ్రేస్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌గా బిగ్ రెడ్ కర్టెన్ వుండగా.. మోనికా క్యారెక్టర్‌ను ప్రెజెంట్ చేసే విధానం సినిమాకి ఉన్న విజువల్ స్టైల్‌ను హైలైట్ చేస్తోంది. ఈ లుక్‌లో పూజా చాలా గ్లామరస్‌గా ఉండగా, క్యారెక్టర్‌కి కావాల్సిన గ్లామర్ టచ్ ను గట్టిగానే చూపించారు.
ఈ పాట చిత్రం నుండి రెండో సింగిల్ కావడం, మోనికా పాత్రకు ప్రత్యేకంగా ఈ లుక్ రివీల్ చేయడం చూస్తే.. సినిమాలో పూజా పాత్ర ఓ స్పెషల్ యాడిషన్ అని తెలుస్తోంది. జులై 11న సాయంత్రం 6 గంటలకు ఈ సాంగ్ విడుదల కానుంది. మాస్ మసాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, మోనికా సాంగ్ కూడా అలాంటి బ్లాక్‌బస్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువే. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ పాటకు కూడా భారీ రెస్పాన్స్ రావడం ఖాయం.
పూజా హెగ్డే కోలీవుడ్‌లో సూర్యతో చేసిన 'రెట్రో' తర్వాత 'కూలీ'లో ఇలా కనిపిస్తుండడం విశేషం. గ్లామర్‌తో పాటు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌లోనూ ఆమెకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ పాట ఆమె కెరీర్‌కు మళ్లీ స్పీడ్ ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే మోనికా పాత్రకు స్పెషల్ ప్రమోషన్ ఇస్తూ సినిమా బజ్‌ను మళ్ళీ పెంచారు. మొత్తానికి ‘కూలీ’లో మోనికా సాంగ్‌తో పూజా దుమ్మురేపేందుకు రెడీ అయిపోయారు.
