Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మ కూడా ఈ రెస్పాన్స్ ఊహించలేదా..?

తెలుగులో అవకాశాలు లేవని ఫీల్ అవుతున్న పూజా హెగ్దే కోలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగిస్తుంది. సినిమాల లెక్క ఎలా ఉన్నా ప్రస్తుతం పూజా హెగ్దే కూలీ సినిమాలో చేస్తున్న స్పెషల్ సాంగ్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   13 July 2025 9:03 PM IST
బుట్ట బొమ్మ కూడా ఈ రెస్పాన్స్ ఊహించలేదా..?
X

బుట్ట బొమ్మ పూజా హెగ్దే సౌత్ లో పెద్దగా ఛాన్స్ లు రాబట్టుకోవట్లేదు. తెలుగులో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టిన పూజా బేబ్ రాధే శ్యాం తర్వాత మహేష్ గుంటూరు కారం ఛాన్స్ అందుకోగా ఆ ప్రాజెక్ట్ నుంచి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా పూజా హెగ్దేకి రాలేదు. తెలుగులో ఇలా ఉంటే తమిళ్ లో మాత్రం పూజా హెగ్దేకి మంచి ఛాన్స్ లు వస్తున్నాయి.

తెలుగులో అవకాశాలు లేవని ఫీల్ అవుతున్న పూజా హెగ్దే కోలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగిస్తుంది. సినిమాల లెక్క ఎలా ఉన్నా ప్రస్తుతం పూజా హెగ్దే కూలీ సినిమాలో చేస్తున్న స్పెషల్ సాంగ్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నా కూడా పూజా హెగ్దే మోనికా అనే స్పెషల్ సాంగ్ చేసింది.

పూజా హెగ్దే ఈమధ్యనే రెట్రోతో తమిల ఆడియన్స్ ముందుకొచ్చింది. ఐతే ఆ సినిమాలో డీ గ్లామర్ గా కనిపించింది. ఐతే కూలీ సాంగ్ లో మాత్రం పూజా బేబ్ తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ముఖ్యంగా పూజా రెగ్యులర్ గా తన సినిమాల్లో చేసే థై షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని వల్ల కూలీ సినిమాలో మోనికా సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది.

విషయం ఏంటంటే ఏదో రజినీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాం అనే భావనలో ఉన్న పూజాకి ఈ సాంగ్ రెస్పాన్స్ చూసి షాక్ అవుతుంది. తమిళ ఆడియన్స్ తనని ఇంతగా ఆదరిస్తున్నారని అమ్మడు సంబరపడుతుంది. కూలీ సినిమాలో మోనికా సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. కూలీ లో స్పెషల్ సాంగ్ తో పాటు పూజా హెగ్దే దళపతి విజయ్ జన నాయగన్, కాంచన 4, ధనుష్ సినిమాలో కూడా అవకాశాలు సపాదించుకుందని తెలుస్తుంది. కోలీవుడ్ లో ఎంత ఫాం కొనసాగిస్తున్నా టాలీవుడ్ నుంచి ఆఫర్ రావట్లేదనే ఆలోచన అమ్మడిలో ఉందని తెలుస్తుంది. మరి తెలుగు నుంచి పూజా హెగ్దేకి ఎలాంటి ఆఫర్ వస్తుందో చూడాలి. పూజా బేబ్ చేసే తెలుగు సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.