Begin typing your search above and press return to search.

ఉన్న ఒక్కటి కూడా డౌటేనా..?

కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు వద్దన్నా సరే ఛాన్స్ లు వస్తాయి. కాస్త గ్రాఫ్ పడిపోతే మాత్రం చేతిదాకా వచ్చిన అవకాశం కూడా చేజారుతుంది.

By:  Tupaki Desk   |   23 May 2025 3:00 AM
ఉన్న ఒక్కటి కూడా డౌటేనా..?
X

కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు వద్దన్నా సరే ఛాన్స్ లు వస్తాయి. కాస్త గ్రాఫ్ పడిపోతే మాత్రం చేతిదాకా వచ్చిన అవకాశం కూడా చేజారుతుంది. ఇలాంటివి ఇంతకుముందు చాలా మందికి జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఐతే ప్రస్తుతం ఇదే బుట్ట బొమ్మ పూజా హెగ్దే విషయంలో రిపీట్ అవుతుంది. టాలీవుడ్ లో వరుస స్టార్ సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు ఎందుకో సడెన్ గా డ్రాప్ అయిపోయింది.

ప్రభాస్ తో రాధే శ్యామ్ చేసిన అమ్మడు ఆ నెక్స్ట్ మహేష్ తో గుంటూరు కారం ఛాన్స్ కూడా అందుకున్నట్టే అనిపించగా సినిమా నుంచి మధ్యలో తప్పుకుంది. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఛాన్స్ పూజా హెగ్దేకి ఇవ్వలేదు. ఈమధ్య అమ్మడు రెట్రో సినిమా ప్రమోషన్స్ లో పూజా హెగ్దే ఒక తెలుగు సినిమా చేస్తున్నట్టు వెల్లడించింది. ఐతే ఆ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసే దాకా వెయిట్ చేయాలని అన్నది.

ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్దేని తప్పించారని టాక్. సూర్య సినిమాలో ఆమె నటించినా సరే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ప్రస్తుతం పూజా హెగ్దే మీద ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ గా లేరన్నట్టుగా చెబుతున్నారు. అందుకే వచ్చిన ఆ ఒక్క ఛాన్స్ కూడా ఆమె నుంచి చేజారిందని అంటున్నారు. ఐతే అది నిజమా కాదా అన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాక తెలుస్తుంది.

ఏది ఏమైన పూజా బేబ్ కి టఫ్ టైం నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు బాలీవుడ్ లో కూడా అమ్మడు సినిమాలైతే చేస్తుంది కానీ ఏ ఒక్కటి సరైన సక్సెస్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం అమ్మడు వరుణ్ ధావన్ తో సినిమాకు రెడీ అవుతుంది. కనీసం సౌత్ లో ఎలాగు లక్ కలిసి రావట్లేదు కాబట్టి అమ్మడికి బాలీవుడ్ లో అయినా సక్సెస్ ఫేజ్ మొదలవుతుందేమో చూడాలి. పూజా హెగ్దే మాత్రం సౌత్ సినిమాల మీద తన ప్రేమను చూపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఛాన్స్ లు మాత్రం అంత ఈజీగా రావట్లేదు. ఐతే టాలీవుడ్ లో ఉన్న పూజా ఫ్యాన్స్ మాత్రం ఆమె ఇక్కడ సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఛాన్స్ రానిది ఆమె కూడా ఏం చేయలేదు కాబట్టి సో వెయిటింగ్ తప్పదని చెప్పొచ్చు.