Begin typing your search above and press return to search.

సరికొత్త లుక్కులో బుట్ట బొమ్మ.. కుర్రాళ్ళ గుండెల్లో గుబులు..

కేవలం గ్లామర్ ఫొటోలే కాకుండా, ఆ పోస్ట్‌తో పాటు కొన్ని ఆధ్యాత్మిక వీడియోలను కూడా పూజా షేర్ చేసింది.

By:  Madhu Reddy   |   28 April 2026 6:34 PM IST
సరికొత్త లుక్కులో బుట్ట బొమ్మ.. కుర్రాళ్ళ గుండెల్లో గుబులు..
X

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పింక్ కలర్ చీరలో, సముద్ర తీరాన సూర్యాస్తమయం వేళ ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఈ ఫొటోలకు 'నమ్మ ఊరు పొన్ను'అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన ఉరిని గుర్తుచేసుకుంటూ ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఆ విశేషాలు చూద్దాం..

పింక్ సారీలో అదిరిపోయే లుక్:

పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటో షూట్‌లో పింక్ కలర్ సిల్క్ చీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. సముద్రపు ఒడ్డున సూర్యుడు అస్తమిస్తున్న వేళ, ఆ వెలుగులో ఆమె అందం రెట్టింపు అయ్యింది. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే తనదైన స్టైల్ తో గ్లామర్ టచ్ ఇచ్చింది పూజా. ఈ ఫొటోలు చూసిన అభిమానులు "బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

నమ్మ ఊరు పొన్ను':

పూజా తన పోస్ట్‌కు 'Namma ooru da ponnu' అనే క్యాప్షన్ ఇచ్చింది. తమిళంలో దీని అర్థం 'మా ఊరి అమ్మాయి' అని. సాధారణంగా పూజా హెగ్డే కుటుంబం కర్ణాటకకు చెందినదైనప్పటికీ, ఆమె ముంబైలో పెరిగింది. అయితే దక్షిణ భారత సంప్రదాయం అంటే తనకు ఎంత ఇష్టమో ఈ క్యాప్షన్ ద్వారా మరోసారి నిరూపించింది. తన సంస్కృతిని, గౌరవిస్తూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ కు దక్షిణాది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆధ్యాత్మిక వేడుకలో సందడి:

కేవలం గ్లామర్ ఫొటోలే కాకుండా, ఆ పోస్ట్‌తో పాటు కొన్ని ఆధ్యాత్మిక వీడియోలను కూడా పూజా షేర్ చేసింది. అందులో దైవ రూపాన్ని నేలపై రంగులతో అందంగా తీర్చిదిద్దుతుండటం మనం చూడవచ్చు. అలాగే కేరళ లేదా తుళునాడు సంప్రదాయం ప్రకారం డోలు వాయిస్తున్న వీడియోలను కూడా ఆమె పంచుకుంది. దీన్ని బట్టి పూజా తన సొంత ఊరిలో విశేష పూజలో కుటుంబంతో పాల్గొన్నట్లు అర్థమవుతోంది.

సంప్రదాయ వాయిద్యాల హోరు:

ఇక పూజా హెగ్డే కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని ఈ పోస్ట్ చూస్తే తెలుస్తుంది. తన బిజీ షెడ్యూల్ లోనూ సమయం దొరికినప్పుడల్లా తన ఊరికి వెళ్లి ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం విశేషం.

పూజా హెగ్డే ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన జననాయగన్‌ రిలీజ్ కు వుంది. ఇక పూజా హెగ్డే కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే వరుస షూటింగ్‌ల మధ్యలో చిన్న విరామం దొరకడంతో ఇలా తన కుటుంబంతో లేదా తన స్వస్థలంలో గడుపుతూ రీఛార్జ్ అవుతోంది. సముద్ర తీరాన ప్రశాంతంగా ఉన్న ఈ ఫొటోలు ఆమె మనసుకి ఎంత ప్రశాంతతను ఇస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది.

స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా తన సంప్రదాయాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వెళ్లి పూజలు చేయించుకొని అక్కడ ఫుడ్ తినటం ఆమె గొప్పతనం. ఇక సారీలో ఆమె అందం ఒకెత్తయితే, తన సంస్కృతి పట్ల ఆమెకున్న గౌరవం మరొకెత్తు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమాల్లోనే కాదు, ఇలాంటి రియల్ లైఫ్ మూమెంట్స్ లో కూడా పూజా అందరి మనసు గెలుచుకుంటోంది.