అందాల పూజ.. ప్యాకప్ మోడ్ పిక్ చూశారా?
అయితే తాజాగా పూజ పెట్టిన క్రేజీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేసిన బ్యూటీ.. ప్యాక్ అప్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
By: Tupaki Desk | 5 July 2025 6:28 PM ISTహీరోయిన్ పూజా హెగ్డే గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆమె.. మధ్యలో వివిధ సినిమాలతో నిరాశపరిచారు. మళ్లీ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా అయ్యారు. వివిధ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న అమ్మడు.. మరిన్ని చిత్రాలను లైన్ లో కూడా పెడుతున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జన నాయగన్ లో హీరోయిన్ గా నటిస్తున్న పూజ.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. రాఘవేంద్ర లారెన్స్ కాంచన -4లో కూడా పూజ యాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా మరో స్టార్ హీరో ధనుష్ మూవీ లో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా పూజ పెట్టిన క్రేజీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేసిన బ్యూటీ.. ప్యాక్ అప్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మేకప్ లేకుండా.. సింపుల్ గా.. వైట్ అండ్ బ్లాక్ టీ షర్ట్ తో కనిపించిన అమ్మడు.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన నేచురల్ అందంతో మెప్పిస్తోంది.
కానీ షూటింగ్ లో పాల్గొని అలసిపోయినట్లు మాత్రం కనిపించింది. ఎండ్-ఆఫ్--డే మిర్రర్ స్నాప్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ గా మారగా.. నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. మిర్రర్ సెల్ఫీ బాగుందని మేడమ్ అని చెబుతున్నారు. మంచి హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నారు.
కాగా, ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న బ్యూటీ.. స్టార్ హీరోలతో ఆడిపాడింది. వరుస ఛాన్స్ లు అందుకున్న పూజ.. ఇప్పుడు మాత్రం తెలుగులో కనిపించడం లేదు. పలు చిత్రాల్లో నటిస్తున్నా.. అవి వేరే భాషలకు చెందినవే. ఆ మధ్య టాలీవుడ్ యంగ్ హీరోలు నాగచైతన్య, విజయ్ దేవరకొండ సినిమాల్లో పూజ నటిస్తారని వార్తలు వచ్చినా అనౌన్స్మెంట్స్ రాలేదు. మరి ఆమె తెలుగు సినిమాల్లో ఎప్పుడు ప్యాకప్ చెప్పే టైమ్ వస్తుందో వేచి చూడాలి.