ఎల్లే కవర్‌పై చిల్లింగ్ పూజా
తమిళ స్టార్ హీరో సూర్య సరసన `రెట్రో` చిత్రంలో నటించింది పూజా హెగ్డే. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ సౌత్ లోకి తిరిగి ఎంట్రీ ఇస్తోంది.
By: Tupaki Desk | 20 April 2025 8:18 AMతమిళ స్టార్ హీరో సూర్య సరసన `రెట్రో` చిత్రంలో నటించింది పూజా హెగ్డే. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ సౌత్ లోకి తిరిగి ఎంట్రీ ఇస్తోంది. రెట్రో మే 1న థియేటర్లలోకి విడుదల కానుంది. తదుపరి దళపతి విజయ్ సరసన జననాయగన్ అనే చిత్రంలోను పూజా నటించనుంది. ఇలాంటి సమయంలో పూజా తన అభిమానులను అస్సలు విస్మరించడం లేదు. వారికి కావాల్సిన ట్రీట్ ని ఇస్తూ పండగ వాతావరణం తెస్తోంది. లేటెస్ట్ ఎల్లే కవర్ షూట్ లో పూజా రకరకాల డిజైనర్ దుస్తుల్లో ఇంటర్నెట్ లో దుమ్ము దులిపేస్తోంది.
కవర్ పేజీ కోసం పూజా చెలరేగి గ్లామర్ ని ప్రదర్శించింది. ఎంపిక చేసుకున్న డిజైనర్ దుస్తుల్లో ట్రెడిషన్ మిస్ కాకుండానే, అందంగా తనలోని పాజిటివ్ ఎలిమెంట్స్ ని మరింత స్టైల్ గా ప్రదర్శించింది. అది రాజస్తానీ కళంకార్ డిజైన్ అయినా లేదా జైపూర్ సాంప్రదాయ డిజైన్ అయినా.. పూజా టోన్డ్ లుక్ ని థై సొగసుల్ని ఎలివేట్ చేస్తూ, రూపొందించిన ఈ డిజైనర్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. పూజా ఎంపిక చేసుకున్న రకరకాల డిజైనర్ దుస్తుల్లో బ్లాక్ కలర్ డిజైనర్ ఫ్రాక్ ఎంతో స్పెషల్ గా ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఎల్లే ఫోటోషూట్ ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో `అల వైకుంఠపురములో` లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన పూజా హెగ్డే చరణ్ సరసన ఆచార్య మూవీలో నటించింది. ఆ తర్వాత పరిశ్రమకు దూరమైంది. మహేష్, చరణ్ లాంటి స్టార్ల సరసన మళ్లీ నటిస్తుందని భావించినా కానీ ఎందుకనో ఈ బ్యూటీకి అవకాశాలు కనుమరుగయ్యాయి. పూజా మళ్లీ ఎప్పటికి రీఎంట్రీ ఇస్తుందో వేచి చూడాలి.