అలాంటివి తింటే ఎక్స్‌ట్రా వర్కవుట్స్ తప్పవు
మూడేళ్ల ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు.
By: Tupaki Desk | 17 May 2025 4:25 PM ISTమూడేళ్ల ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. ముకుంద సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పూజా తక్కువ కాలంలోనే సౌత్ లోని అగ్ర హీరోలందరితో జత కట్టి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. కానీ వరుస ఫ్లాపులు పూజాకు తెలుగులో ఆఫర్లను తగ్గించేశాయి.
రాధేశ్యామ్ తర్వాత పూజా కెరీర్ బాగా డల్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి పూజా ఏ సినిమా చేసినా ఫ్లాపే అవుతుంది. దీంతో దర్శకనిర్మాతలు ఆమె వెంట పడటం మానేశారు. అయితే రీసెంట్ గా సూర్య హీరోగా కోలీవుడ్ లో పూజా హెగ్డే రెట్రో అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రమోషన్స్ లో భాగంగా పూజా తాను త్వరలోనే తెలుగులో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నట్టు వెల్లడించింది.
రెట్రో సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమాను అందరికంటే ఎక్కువగా ఓన్ చేసుకుని మరీ పూజా ప్రమోషన్స్ చేస్తే ఆ సినిమా కూడా అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది. కోలీవుడ్ లోనే సక్సెస్ అవని ఈ సినిమాను తెలుగులో ఎవరూ పెద్దగా పట్టించుకున్నది లేదు. ప్రస్తుతం తమిళంలో విజయ్ తో కలిసి జన నాయగన్ సినిమా చేస్తున్న పూజా ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తోంది.
జన నాయగన్ హిట్ అయితే పూజాకు మళ్లీ అవకాశాలు వచ్చే ఛాన్సుంది. ఆ సినిమా కూడా అమ్మడికి నిరాశే మిగిలిస్తే ఇక పూజా తన కెరీర్ పై ఆశలు వదులుకోవాల్సిందేననే పరిస్థితికి వస్తుంది. అయితే పూజా చేతిలో ఆఫర్లున్నా లేకపోయినా అమ్మడు ఫిట్‌నెస్, వర్కవుట్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంది.
అందులో భాగంగానే రీసెంట్ గా ఇన్‌స్టాలో అమ్మడు ఓ స్టోరీ పెట్టింది. బ్రెడ్, నూడుల్స్ లాంటివి తింటే ఎక్స్‌ట్రా వర్కవుట్స్ చేయాల్సిందేనంటూ పూజా ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఆ సెల్ఫీలో పూజా అప్పుడే వర్కవుట్స్ చేసి అలసిపోయి పడుకున్నట్టు కనిపిస్తోంది. పూజా షేర్ చేసిన ఈ సెల్ఫీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
