పూజా హెగ్డే హోమ్ సిక్ రెమెడీ ఏంటో తెలుసా?
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా అలాంటి ఒక రెమెడీని కనిపెట్టింది. పార్లే- జి బిస్కెట్స్ ను వేడి టీ తో కలిపి తింటూ తన హోమ్ సిక్ ను పోగొట్టుకుంటుంది.
By: Tupaki Desk | 9 Jun 2025 1:30 PM ISTసినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ గా చలామణి అవాలంటే ప్రతీ రోజూ ఇంట్లోనే ఉండటం కుదరదు. ఇంటికి దూరంగా చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. అలాంటి టైమ్ లో ప్రతీ ఒక్కరూ ఇంటిని మిస్ అవడం, ఇంటిపై బెంగ రావడం సహజం. అయితే ఆ ఇంటిపై బెంగను పోగొట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ దాన్నిఅధిగమిస్తూ ఉంటారు.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా అలాంటి ఒక రెమెడీని కనిపెట్టింది. పార్లే- జి బిస్కెట్స్ ను వేడి టీ తో కలిపి తింటూ తన హోమ్ సిక్ ను పోగొట్టుకుంటుంది. ఈ విషయాన్ని పూజా హెగ్డేనే స్వయంగా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూజా వేడి టీ లో బిస్కెట్లను కలిపి తింటూ ఇది తనకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్ అని దానికి సంబంధించిన వీడియోను కూడా పూజా షేర్ చేసింది.
ప్యాకెట్ లో నుంచి ఒక బిస్కెట్ ను తీసి దీన్ని నా చాయ్ లో ముంచుతున్నా అని చెప్పిన పూజా, ఇది చాలా డేంజరస్ స్టఫ్ అని కూడా ఆ వీడియో ఆఖరిలో చెప్పింది. దీంతో పాటూ హోమ్ సిక్ రెమెడీస్ అనే క్యాప్షన్ ను కూడా పూజా ఆ వీడియోకు జోడించింది. ఇక కెరీర్ విషయానికొస్తే పూజా రీసెంట్ గానే కోలీవుడ్ లో సూర్య తో కలిసి రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
ప్రస్తుతం పూజా హై జవానీ తో ఇష్క్ హోనా హై తో బిజీగా ఉంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, మౌనీ రాయ్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మనీష్ పాల్, కుబ్రా సైట్, రోహిత్ సరాఫ్, రాజీవ్ ఖండేల్వాల్, నితీష్ నిర్మల్ లాంటి భారీ తారాగణం నటించనుంది.
పూజా తెలుగు సినిమాల విషయానికొస్తే అమ్మడు టాలీవుడ్ లో సినిమా చేసి చాలా కాలమైంది. ఆచార్య తర్వాత పూజా హెగ్డే మరో తెలుగు సినిమా చేసింది లేదు. వరుస ఫ్లాపులు తెలుగులో పూజాకి ఆఫర్లను బాగా తగ్గించేశాయి. రీసెంట్ గా రెట్రో సినిమా ప్రమోషన్స్ లో తానొక తెలుగు సినిమాకు సైన్ చేశానని, అది ప్యూర్ లవ్ స్టోరీ అని, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.