Begin typing your search above and press return to search.

ఆ అవ‌కాశం వ‌స్తే అస‌లు వ‌దులుకోను

పూజా అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో బుట్ట‌బొమ్మ సాంగ్ కు పూజా వేసిన స్టెప్పులు అంద‌రినీ ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

By:  Tupaki Desk   |   16 April 2025 5:30 PM IST
ఆ అవ‌కాశం వ‌స్తే అస‌లు వ‌దులుకోను
X

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన పూజా హెగ్డే అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డీజే త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకునే ప‌నిలేకుండా పూజాకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. దీంతో పూజా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సౌత్ లోని అగ్ర హీరోలంద‌రితో న‌టించేసింది పూజా హెగ్డే.

పూజా అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో బుట్ట‌బొమ్మ సాంగ్ కు పూజా వేసిన స్టెప్పులు అంద‌రినీ ఎంతో ఆక‌ట్టుకున్నాయి. అందుకే పూజాకు బుట్ట‌బొమ్మ అనే ట్యాగ్ ను ఇచ్చేసి ఆ పేరుతోనే పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ రాధే శ్యామ్ సినిమా త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు పూజాని వెంటాడాయి. క్ర‌మంగా టాలీవుడ్ నుంచి పూజాకు ఛాన్సులు త‌గ్గాయి.

అలా అని పూజా త‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లిన క‌థ‌ల్ని విన‌కుండా ఏమీ లేదు. వ‌రుస ఫ్లాపుల తర్వాత క‌థ‌ల ఎంపిక విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉన్న పూజాకు ఏ క‌థ విన్నా ఎగ్జైట్మెంట్ రాక‌పోవ‌డం వ‌ల్లే ఇన్నాళ్లు తెలుగు ఇండ‌స్ట్రీకి దూర‌మయ్యాన‌ని రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన అమ్మ‌డు, ఆల్రెడీ తాను తెలుగులో ఓ సినిమాకు సైన్ చేశాన‌ని తెలిపింది.

పూజా న‌టించిన సినిమా రెట్రో మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై పూజా ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమాలో త‌న పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, ఇక ముందు తాను చేసే పాత్ర‌ల‌న్నీ ఆడియ‌న్స్ కు కొత్త పూజాని ప‌రిచ‌యం చేస్తాయ‌ని చెప్తుంది పూజా. తెలుగులో మ‌ళ్లీ ఓ ల‌వ్ స్టోరీతో ఎంట్రీ ఇవ్వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్తున్న పూజా, తెలుగు ఆడియ‌న్స్ త‌న‌ను ఎంత‌గానో ఆద‌రించార‌ని, హైద‌రాబాద్‌ను తాను సొంత ఇంటిలా భావిస్తాన‌ని చెప్తోంది.

శ్రీదేవి బ‌యోపిక్ లో న‌టించే అవ‌కాశం వ‌స్తే అస‌లు వ‌దులుకోన‌ని పూజా ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది. అయితే శ్రీదేవి బ‌యోపిక్ ను తీయ‌న‌ని ఇప్ప‌టికే శ్రీదేవి భ‌ర్త బోనీక‌పూర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక రెట్రో సినిమా విష‌యానికొస్తే ఈ సినిమాలో పూజా హెగ్డే సూర్యకు భార్య గా క‌నిపించ‌నుంది. రిలీజ్ కు మ‌రో రెండు వారాలు మాత్ర‌మే ఉండ‌టంతో చిత్ర యూనిట్ కంటే ముందుగానే పూజా తెలివిగా తెలుగులో ఇంట‌ర్య్వూలు ప్లాన్ చేసి, తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రోసారి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేసింది పూజా.