Begin typing your search above and press return to search.

పూజా బేబి తదుపరి కర్తవ్యం..?

కెరీర్ లో ఒక రేంజ్ స్టార్ ఫాం కొనసాగించి అతి కొద్దికాలంలోనే ఆ గ్రాఫ్ పడిపోతే ఆ హీరోయిన్ పరిస్థితిని ఊహిస్తేనే అదోలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 12:30 AM
Pooja Hegde From Pan-India Star to Career Crossroads
X

కెరీర్ లో ఒక రేంజ్ స్టార్ ఫాం కొనసాగించి అతి కొద్దికాలంలోనే ఆ గ్రాఫ్ పడిపోతే ఆ హీరోయిన్ పరిస్థితిని ఊహిస్తేనే అదోలా ఉంటుంది. ఐతే ఎంట్రీ ఇచ్చేప్పుడు స్టార్ అవుతామని ఊహించరు కానీ ఆడియన్స్ లో ఒక గుర్తింపు వచ్చాక అది క్రమ క్రమంగా తగ్గుతూ వస్తే మాత్రం కొంత ఇబ్బంది తప్పదు. ఈ టైం లో అసలు కెరీర్ ఎటు వెళ్తుంది అనే డైలమా స్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం చూస్తుంటే బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఈ సిచ్యువేషన్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సౌత్ లో అదే మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చేస్తూ వచ్చిన అమ్మడు పాన్ ఇండియా క్రేజ్ కూడా అందుకుంది.

తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అమ్మడు తన మార్క్ నటనతో సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగులో దాదాపు అందరు స్టార్స్ తో నటించిన పూజా హెగ్దే అలా టాప్ ప్లేస్ కొనసాగుతూనే సడెన్ గా డ్రాప్ అయిపోయింది. అసలు పూజా హెగ్దేకి టాలీవుడ్ ఆఫర్లు ఎందుకు రావట్లేదు అన్న దానికి క్లారిటీ లేదు. ప్రభాస్ తో రాధే శ్యాం సినిమా చేశాక ఆ సినిమా రిజల్ట్ తో మన మేకర్స్ ఆమెను సైడ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయినా సరే సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.

ఐతే ఆ సినిమా షూటింగ్ కాస్త లేట్ అవ్వడం ఆ టైం లో తను వేరే సినిమాలకు కమిట్ అవ్వడంతో ఉన్న ఒక్క ఛాన్స్ కాస్త మిస్ అయ్యింది. గుంటూరు కారం నుంచి పూజా హెగ్దే స్కిప్ అవ్వడమే ఆలస్యం ఆమెకు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా ఆఫర్ రాలేదు. ఐతే హిందీలో సల్మాన్, షాహిద్ లతో సినిమాలు చేసినా అవేవి వర్క్ అవుట్ కాలేదు. తమిళ్ లో కూడా అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది పూజా హెగ్దే.

ఈ మధ్యనే అమ్మడు సూర్య నటించిన రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో పూజా హెగ్దే డీ గ్లామర్ రోల్ పాత్ర పరంగా ఓకే అనిపించినా బుట్ట బొమ్మ ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అయ్యారు. ఓవరాల్ రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే పూజా హెగ్దే నెక్స్ట్ ఏం చేయాలనే కన్ ఫ్యూజన్ లో ఉంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో ఒక సినిమా చేస్తున్న పూజా బేబ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. అక్కడే దళపతి విజయ్ జన నాయగన్ లో కూడా పూజా హెగ్దే నటిస్తుంది.