రియలైజేషన్ ప్లాప్ ల్లోనేనా..వివాదాల్లో కూడానా?
వైఫల్యాలు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయి. తదుపరి నిర్ణయాల విషయంలో పదిసార్లు ఆలోచించి తీసు కుంటాం.
By: Tupaki Desk | 9 Jun 2025 6:00 PM ISTవైఫల్యాలు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయి. తదుపరి నిర్ణయాల విషయంలో పదిసార్లు ఆలోచించి తీసుకుంటాం. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అందరూ తప్పులు చేసి ఎదిగిన వారే. ఇటీవలే ఇలాంటి రియలైజేషన్ పూజాహెగ్డే మాటల్లో బయటపడింది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ అవకా శాలు రావడంతో? ఉన్న అవకాశాలను కూడా వదులుకుని హిదీ పరిశ్రమకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడా వరుస వైఫల్యాలు ఎదురవ్వడంతో? ఎక్కువ ఆలోచించకుండ మళ్లీ సౌత లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టి కొన్నింటిని అందుకుంది.
ఇప్పుడిప్పుడే మళ్లీ తమిళ్ లో బిజీ అవుతుంది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేస్తోంది. ఏదో ఒక సినిమా తో మంచి కంబ్యాక్ ఇస్తుంది అన్న నమ్మకం ఉంది. ఇదే సమయంలో కొన్ని సినిమాల్లో పాత్రల పరంగా తాను తీసుకున్న నిర్ణయాలు రేసులో వెనక్కి నెట్టనట్లుగా రియలైజ్ అయింది. అయితే రియలైజేషన్ కోలీవుడ్, బాలీవుడ్ కే పరిమితమా? టాలీవుడ్ లోనూ అనుసరిస్తుందా? అన్నదే టాపిక్ ఇక్కడ.
ఆ మధ్య తెలుగులో ఓ స్టార్ హీరోతో ఓ భారీ బడ్జెట్ సినిమా చేసింది. చిత్రీకరణ మొదలైన దగ్గర నుంచే యూనిట్ తో వివాదాలు మొదలయ్యాయి. కమిట్ అయింది కాబట్టి ఆ సినిమా పూర్తిచేసింది. ప్రచారం మొదలయ్య సరికి మళ్లీ ఆ చిత్ర నిర్మాతలు, హీరోని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రచారానికి సరిగ్గా సహకరిచకుండా ఇబ్బంది పెడుతుందనే అంశం తెరపైకి వచ్చింది. అయితే అదంతా మౌనంగా..రసహ్యంగానే నడిచిది తప్ప తనకు తానుగా బహిర్గతం కాలేదు. ఈ విషయంలో బుట్ట బొమ్మను మెచ్చుకోవాల్సిందే.
మనసులో ఉద్దేశం ఎలాంటిదైనా? ఓపెన్ అవ్వలేదు. మరి ఇలాంటి విషయాల పట్ల అమ్మడిలో రియలై జేషన్ కలిగిందా? లేదా? అన్నది తేలాలి. తప్పు ఎవరిది? అన్నది పక్కన బెడితే? తన వైపు నుంచి సినిమాకు ఎంత వరకూ న్యాయం జరిగిందన్నది ఓపెన్ అయితే ఇబ్బందే ముంది. అదే చేయగల్గితే మళ్లీ తెలుగులోనూ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగానే టాలీవుడ్ లో ఛాన్సులు రాలేదు అనే అపవాద నుంచి బయట పడే అవకాశం ఉంటుంది.
