Begin typing your search above and press return to search.

ఈ ఏడాదితో పూజ ఫ్యూచర్‌ తేలిపోనుందా?

టాలీవుడ్‌ టాప్ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితోనూ హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 8:00 PM IST
ఈ ఏడాదితో పూజ ఫ్యూచర్‌ తేలిపోనుందా?
X

టాలీవుడ్‌ టాప్ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితోనూ హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె జోరు కొన్నాళ్లకే మసకబారింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు.. ఐదు సినిమాలు ఉన్నాయి. అన్నీ కూడా హిందీ, తమిళ్ సినిమాలు కావడం విశేషం. తెలుగులో ఈ అమ్మడు మళ్లీ నటిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగులో ఒకప్పుడు మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా ఆఫర్‌ చేతిలో లేకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీల్‌ అవుతున్నారని తెలుస్తోంది. ముందు ముందు అయినా ఈమె టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేనా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు, ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే తప్పకుండా తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ మరోసారి ఈమె వైపు తిరిగి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో సక్సెస్‌లు ఉన్న వారికే ఆఫర్లు వస్తాయి. అదే ఫార్ముల ఖచ్చితంగా పూజా హెగ్డేకు వర్కౌట్‌ అవుతుంది. రాబోయే ఏడాది కాలంలో పూజా హెగ్డే నుంచి కూలీ, హై జవానీ తో ఇష్క్ హోనా హై, జన నాయగన్‌, కాంచన 4 సినిమాలు రానున్నాయి. ఈ నాలుగు సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో పాటు, ఆ సినిమాల్లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు దక్కడంతో పాటు, ఆమె నటన గురించి మాట్లాడుకుంటే అప్పుడు కోలీవుడ్‌లో ఛాన్స్ దక్కవచ్చు.

టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఈ అమ్మడు కంటిన్యూ కావాలన్నా కూడా ఆ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి కెరీర్‌ ఊగిసలాటలో ఉంది. ఆ సినిమాల ఫలితాలపైనే ఈమె యొక్క సినిమా కెరీర్‌ ఆధారపడి ఉంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న అందమైన ఫోటోలను అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. కానీ సినిమాల్లో ఈమె పాత్రలను సైతం ఇష్టపడితేనే కెరీర్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రాబోయే ఏడాది కాలం పాటు ఈమెకు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె చేసిన డీజే, అరవింద సమేత, అల వైకుంఠపురంలో, రాధేశ్యామ్‌ సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇంకా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు బ్యాక్‌ టు బ్యాక్ ఫ్లాప్స్ కారణంగా టాలీవుడ్‌కి దూరం అయింది. ఈమె కెరీర్ ఖతం అనుకున్న సమయంలో అనూహ్యంగా అదృష్టం కొద్ది కోలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు దక్కాయి. ఆ ఆఫర్లతో రెండేళ్లుగా కెరీర్‌ను నెట్టుకు వస్తున్న ఈ అమ్మడు మరో ఏడాది పాటు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హిట్‌ అయితేనే ఫ్యూచర్‌ ఉంటుంది. అందుకే రాబోయే ఏడాది కాలంలో వచ్చే సినిమాలు పూజా హెగ్డేకు అత్యంత కీలకం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ సినిమాలు హిట్‌ అయితేనే సౌత్‌, నార్త్‌లో ఈమె జోరు కొనసాగే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ సినిమాల ఫలితాలు ఏంటో చూడాలి.