హిట్టూ, ఫ్లాపు.. రెండింటినీ ఒకేలా తీసుకుంటా
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లోనే ఉంది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
By: Tupaki Desk | 9 Jun 2025 3:00 AM ISTటాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లోనే ఉంది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే నుంచి తెలుగులో సినిమా వచ్చి మూడేళ్లవుతుంది. తెలుగులో అమ్మడి జోరు తగ్గినా ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది పూజా.
రీసెంట్ గా రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పూజా హెగ్డే ఆ సినిమాతో మరో ఫ్లాపుని తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే దళపతి విజయ్ తో కలిసి జన నాయగన్ సినిమాతో అభిమానుల్ని పలకరించడానికి రెడీ అవుతున్న పూజా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భాక్సాఫీస్ ఫ్లాపుల గురించి, తన సినీ కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
రీసెంట్ టైమ్స్ లో తాను చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ ను ఇవ్వలేకపోయాయని, కొన్నేళ్లుగా తన కెరీర్లో సక్సెస్ కు మీనింగ్ మారిపోయిందని చెప్పింది. తాను ఇప్పుడున్న స్టేజ్ తనకెంతో ముఖ్యమైందని, తన రాబోయే సినిమాలు తానెలాంటి నటిననే విషయాన్ని ఆడియన్స్ కు మరోసారి ప్రూవ్ చేస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నట్టు పూజా చెప్పింది.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారని, అందరికీ ఛాన్సులు రావాలంటే ఎంతో కష్టపడాలని, ఎన్నో ఛాలెంజెస్, మరెన్నో అనుభవాలతో తాను ఇండస్ట్రీలో ఒక పొజిషన్ లో ఉన్నానని, కానీ కెరీర్ లో తాను సాధించాల్సింది ఇంకా ఉందని, సినిమాల్లోని పాత్రల్లో నటిస్తున్నప్పుడు నటులు అందులో జీవిస్తారని, ఒకవేళ అది హిట్ అవకపోయినా ఆశ్చర్యానికి గురవాల్సిన పన్లేదని పూజా చెప్పింది. సక్సెస్ ను యాక్సెప్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్ ను కూడా యాక్సెప్ట్ చేయాలని, దాన్ని అంగీకరించకపోతే ఆడియన్స్ ను కొత్తగా ఏమీ అందించలేమని చెప్పింది.
ఒక్కోసారి ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన సినిమాలు కూడా ఫ్లాపవుతాయని, అలా అని కష్టపడిన ప్రతీసారీ ఫ్లాపులే వస్తాయని చెప్పలేమని, లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టే సినీ కెరీర్లో కూడా హెచ్చుతగ్గులుంటాయని చెప్పింది పూజా. ప్రస్తుతం తన టార్గెట్ నటిగా తనను విమర్శించిన వారితో ప్రశంసలందుకోవడమేనని చెప్పింది. తన సినిమా హిట్టైనా, ఫ్లాపైనా తాను ఎప్పుడూ ఒకేలా ఉంటానని చెప్పిన పూజా ఇప్పుడు కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడి నటిగా కొత్తగా జర్నీని మొదలు పెట్టాలనుకుంటున్నట్టు పూజా చెప్పింది.
