ఆరంభం కాదు ఆ తర్వాత అదరగొట్టేలా..!
ఆరంభం బాగా లేకపోయినా సరే ఆ తర్వాత సినిమాల్లో రాణిస్తారు కొందరు హీరోయిన్స్.
By: Tupaki Desk | 15 July 2025 9:00 AM ISTఆరంభం బాగా లేకపోయినా సరే ఆ తర్వాత సినిమాల్లో రాణిస్తారు కొందరు హీరోయిన్స్. అలాంటి లిస్ట్ లో తాజాగా ఇద్దరు హీరోయిన్స్ ఒకే రకమైన క్రేజ్ తో ముందు ఫ్లాపులతో నిరాశ పరిచిన ఆ తర్వాత హిట్ ఫాం కి వచ్చారు. ఈ లిస్ట్ లో ముందుగా బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు చేయగా ఆ రెండు వర్క్ అవుట్ కాలేదు. ఐతే అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాతో లక్కీ ఛాన్స్ అందుకుని ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది.
ముఖ్యంగా డీజే సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ షో ఆమెను ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. హరీష్ శంకర్ ఇచ్చిన ఛాన్స్ ని అన్ని విధాలుగా వాడుకుంది పూజా హెగ్దే. ఇక డీజే తర్వాత పూజా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేసింది. ఐతే ఇప్పుడు కాస్త తమిళ్ లో బిజీ అయ్యింది కాబట్టి టాలీవుడ్ లో సినిమాలు చేయట్లేదు పూజా.
ఐతే ఇదే వరుసలో భాగ్య శ్రీ బోర్స్ కూడా అదే రూట్ లో తొలి సినిమా ఫ్లాప్ వచ్చినా వరుస స్టార్ ఛాన్స్ లు అందుకుంటుంది. మిస్టర్ బచ్చన్ తో తెలుగు తెరకు పరిచయమైన భాగ్య శ్రీ బోర్స్ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో కింగ్ డం, రాం తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు తప్పకుండా భాగ్య శ్రీకి మంచి మైలేజ్ ఇచ్చేలా ఉన్నాయి.
ఈ ఇద్దరి హీరోయిన్స్ కి హరీష్ శంకర్ ఛాన్స్ ఇవ్వడం ఆయన సినిమా తర్వాత క్రేజ్ తెచ్చుకోవడం జరిగింది. పూజా బాటలోనే భ్గాగ్య శ్రీ కూడా ఆరంభం అదరగొట్టకపోయినా ఆ తర్వాత మాత్రం స్టార్ ఛాన్స్ లతో దుమ్ము దులిపేస్తున్నారు.తప్పకుండా భాగ్య శ్రీ కూడా టాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో మెప్పించేలా ఉంది. భాగ్య శ్రీ సినిమాలు ఒక్కోటి చాలా స్పెషల్ గా అనిపిస్తున్నాయి. పూజా హెగ్దే కాదు ఆమెను మించేలా భాగ్య శ్రీ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. పూజా హెగ్దే ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయట్లేదు. ఐతే ఆమెను టాలీవుడ్ మేకర్స్ ఎందుకు దూరం పెడుతున్నారన్న రీజన్ మాత్రం తెలియట్లేదు.
