Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోనూ గ్లామ‌ర్ వీళ్ల సొంత‌మే!

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌కీయాల్లో రాణించిన వెండి తెర అందాల గురించి మాట్లాడుకుంటే..

By:  Tupaki Desk   |   8 March 2024 9:13 AM GMT
రాజకీయాల్లోనూ  గ్లామ‌ర్ వీళ్ల సొంత‌మే!
X

మ‌హిళ‌లు లేని రంగమంటూ లేదిప్పుడు. మ‌హిళా సాధికార‌త‌లో భాగంగా అన్నింటా మ‌హ‌ళ‌లు రాణిస్తు న్నారు. రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పిన మ‌హిళ‌లెంతో మంది ఉన్నారు. మ‌రి రాజ‌కీయాల‌కు గ్లామ‌ర్ జోడించిన నాయిక‌లు ఎవ‌రు? అంటే వీళ్ల గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుకోవాల్సిందే. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌కీయాల్లో రాణించిన వెండి తెర అందాల గురించి మాట్లాడుకుంటే..


త‌మిళ‌నాడు రాజ‌కీయాలంటే గుర్తొచ్చేది జ‌య‌ల‌లిత‌. అక్కడ రాజకీయాన్ని కంటిచూపుతోనే శాషించినా మ‌హిళ నేత ఆమె. న‌టిగా జీవితాన్ని ప్రారంభించి అన్నాడీఎంకే అధినేత్రిగా ఎదిగిన వైనం ఎంతో ప్ర‌శంస‌నీయం. సినిమాలు చేస్తూ రాజ‌కీయం చేయ‌డం అన్న‌ది జ‌య‌ల‌లిత‌కే సాధ్య‌మైంద‌ని నిరూపిం చారు. 43 ఏళ్ల‌గా ముఖ్య‌మంత్రిగా పీఠం ద‌క్కించుకుని అతి పిన్న వ‌య‌సులోనే సీఎంగా ఎదిగిన న‌టి అంటూ నీరాజ‌నాలు అంద‌కున్నారు.

ఇక ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఫేమ‌స్ అయిన రోజా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రాజ‌కీయా ల‌కంటే ముందే నాగార్జున యూనివ‌ర్శిటీ నుంచి రాజ‌కీయ విజ్ఞానంలో ప‌ట్టా సంపాదించారు. ఎమ్మె ల్యేగా..మంత్రిగా ప్ర‌జ‌ల‌కు సేవ చేసారు. ప్ర‌స్తుతం వైకాపాలో కొన‌సాగుతున్నారు. అలాగ‌ని రోజా వెండి తెర‌కు పూర్తిగా దూరం కాలేదు. అవ‌కాశాలు వ‌స్తే సినిమాలు కూడా చేస్తున్నారు. టెలివిజ‌న్ షోస్ తోనూ ఆమె ఎంతో ఫేమ‌స్ అయ్యా రు. అయితే వైకాపాలో గెలిచిన త‌ర్వాత రంగుల ప్ర‌పంచానికి దూరంగా ఉన్నారు.

అలాగే క‌న్న‌డ న‌టి సుమ‌ల‌త భ‌ర్త అంబ‌రీష్ మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నిక‌ల్లో మాండ్య నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆమె గెలుపు కోసం కేజీఎఫ్ హీరో య‌శ్... నిర్మాత రాక్ లైన్ వెంక‌టేష్.. ద‌ర్శ‌న్ లాంటి వారు మ‌ద్ద‌తివ్వ‌డం విశేషం. 2024 ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ విజ‌య‌శాంతి రాజ‌కీయాల కోసం సినిమాలే వ‌దిలేశారు.

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషించారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఉమ్మ‌డి ఆంద్ర ప్ర‌దేశ్ లోనూ ఆమె రాజ‌కీయం ఎంతో కీల‌కంగా ఉండేది అన్న సంగ‌తి తెలిసిందే. సొంతంగా త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాప‌న అటుపై టీఆర్ ఎస్ లోవిలీనం చేసారు. ప్ర‌స్తుతం బిజేపీలో కొన‌సాగుతున్నారు. ఇక పంజాబీ బ్యూటీ న‌వ‌నీత్ కౌర్ కూడా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో 20 సినిమాలు చేసిన న‌టి ఎమ్మెల్యే ర‌వి రాణాతో వివాహం త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ఇక స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఫేమ‌స్ అయిన న‌గ్మ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు చేసింది లేదు గానీ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార క‌ర్త‌గా కీల‌క బాధ్య‌త‌లు తీసుకున్నారు. కానీ ఇప్పుడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.