Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ లో పొలిటికల్ వెన్నుపోటు..?

ప్రస్తుతం ఈ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కథ వైరల్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

By:  Tupaki Desk   |   17 March 2024 6:13 AM GMT
గేమ్ ఛేంజర్ లో పొలిటికల్ వెన్నుపోటు..?
X

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత చరణ్ సోలో హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై అటు ఫ్యాన్స్ తోపాటు ఇటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిత్రీకరణ జరుగుతూనే ఉన్నా.. ఇప్పటికీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఆ మధ్య దిల్ రాజు.. సెప్టెంబర్ లో రిలీజ్ అన్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్.. వైజాగ్ లో జరుగుతోంది. కీలక షెడ్యూల్ లో భాగంగా అక్కడ సినిమాలో మెయిన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ రాకపోయినా.. గత రెండు రోజులుగా నటీనటుల షూటింగ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కథ వైరల్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ముగ్గురు పొలిటకల్ విలన్ల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీలో శ్రీకాంత్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర విలన్లుగా నటిస్తున్నారట. వీరు ముగ్గురు కలిపి ఆడే పొలిటికల్ గేమ్ ను రంగంలోకి దిగి రామ్ చరణ్ ఎలా గెలిచాడన్నదే మెయిన్ స్టోరీ లైన్ అంట. మూవీలో స్టోరీ తో పాటు మంచి పొలిటికల్ డ్రామా బాగా ఉందని టాక్ వినిపిస్తోంది.

ప్రజల కోసం అప్పన్న అనే వ్యక్తి పెట్టిన పార్టీని ఒక విలన్ (శ్రీకాంత్) వెన్నుపోటుతో స్వాధీనం చేసుకుంటాడట. మరో ఇద్దరు విలన్లు కూడా శ్రీకాంత్ కు మించి ఎత్తుగడలు వేసి ప్రజల సొమ్మును లాక్కుంటారట. చివరకు ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ వచ్చి వారి అంతు చూస్తాడంట. సినిమా అంతా ఊహించని మలుపులు తిరుగుతుందట. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, సునీల్, జయరాంకు కీలక పాత్రలు దక్కాయట. ఇక ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి మరి.