Begin typing your search above and press return to search.

'పొలిమేర' తో మంగళవారం కి బూస్ట్‌

ఇప్పటికే పొలిమేర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేస్తోంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 7:16 AM GMT
పొలిమేర తో మంగళవారం కి బూస్ట్‌
X

ఈ మధ్య కాలంలో హర్రర్‌ థ్రిల్లర్ సినిమాలు టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వస్తున్నాయి. విరూపాక్ష సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కుప్పలు తెప్పలుగా వస్తాయని ఇప్పటికే తేలిపోయింది. ఆ కోవలోనే వచ్చిన చిత్రం 'మా ఊరి పొలిమేర 2' ఒకటి కాగా మరోటి 'మంగళవారం'.

ఇప్పటికే పొలిమేర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి పొలిమేర 2 కి భారీగా వసూళ్లు వస్తున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పొలిమేర 2 కి భారీగా వస్తున్న వసూళ్లు మంగళవారం సినిమాకు బూస్ట్‌ ని ఇస్తున్నాయి.

సత్యం రాజేష్ లీడ్ రోల్‌ లో కనిపించిన పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సమయంలోనే ఆయనే నటించిన మంగళవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా మంగళవారం సినిమా పై ఉంది. విభిన్నమైన హారర్ థ్రిల్లర్ గా మంగళవారం సినిమా ను రూపొందించినట్లు దర్శకుడు అజయ్ భూపతి చెబుతున్నాడు.

ఈ మధ్య కాలంలో వచ్చి సక్సెస్ అయిన హర్రర్‌ థ్రిల్లర్ సినిమాల తరహాలోనే మంగళవారం ఉంటుందని ప్రచారం జరుగుతున్న కారణంగా ఆ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఆ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. అజయ్ భూపతి నుంచి ఓ మంచి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న వారికి కచ్చితంగా మంగళవారం సినిమా సంతృప్తిని కలిగిస్తుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.