Begin typing your search above and press return to search.

వార్నీ.. ఈ పొలిమేర చాలా దూరం వెళ్లేలా ఉందే!

అంతే కాకుండా పొలిమేర 2 కి సూపర్ హిట్ రేంజ్ లో కలెక్షన్స్ నమోదు అవుతున్న నేపథ్యంలో పొలిమేర 3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   7 Nov 2023 12:30 PM GMT
వార్నీ.. ఈ పొలిమేర చాలా దూరం వెళ్లేలా ఉందే!
X

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొలిమేర 2' సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. వారం రోజులు కూడా పూర్తి అవ్వకుండానే చాలా ఏరియాల్లో సినిమాకు బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ నమోదు అయినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు కేవలం థియేటర్ల ద్వారా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక పొలిమేర 2 సినిమా యొక్క ఓటీటీ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ మొత్తంలో నిర్మాత దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కలు చూస్తూ ఉంటే పొలిమేర 2 చాలా దూరం వెళ్లేలా ఉంది అనిపిస్తుంది. అంతే కాకుండా పొలిమేర 2 కి సూపర్ హిట్ రేంజ్ లో కలెక్షన్స్ నమోదు అవుతున్న నేపథ్యంలో పొలిమేర 3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి పొలిమేర భారీ వసూళ్లు రాబడుతూ, ముందు ముందు మరిన్ని పార్ట్ లు రాబోతున్న నేపథ్యంలో చాలా దూరం ఈ జర్నీ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. పొలిమేర మొదటి భాగం ను ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు ఆ పార్ట్‌ ని కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో తెగ చూస్తున్నారు.

నవంబర్‌ 3న కీడా కోలా సినిమాతో పాటు వచ్చిన పొలిమేర 2 సినిమా కి మంచి వసూళ్లు వస్తున్నాయి. టాక్ పరంగా కీడా కోలా కి మంచి రివ్యూలు వచ్చాయి. కానీ వసూళ్లు మాత్రం పొలిమేర 2 కి రావడం అందరికీ ఆశ్చర్యం ని కలిగిస్తున్నాయి. మొత్తానికి పొలిమేర 2 సినిమా ను చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. లాంగ్ రన్ లో పొలిమేర 2 సినిమా రూ.10 కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.