Begin typing your search above and press return to search.

రెండో 'పొలిమేర'కి సెన్సార్ కత్తెర ఇందుకే..!

సత్యం రాజేష్ ముఖ్య పాత్రలో నటించిన పొలిమేర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   2 Nov 2023 11:12 AM GMT
రెండో పొలిమేరకి సెన్సార్ కత్తెర ఇందుకే..!
X

సత్యం రాజేష్ ముఖ్య పాత్రలో నటించిన పొలిమేర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పొలిమేర సినిమాలోనే సీక్వెల్‌ ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. పొలిమేర 2 ను తాజాగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. గత కొన్ని రోజులుగా పొలిమేర 2 గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమా వెనుక ఉండటంతో పాటు విడుదల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకి కంటెంట్‌ నచ్చితేనే సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ముందుకు వస్తారు. కనుక ఈ సినిమా తప్పకుండా బాగుండి ఉంటుంది అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్‌ అవ్వడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు.

నవంబర్‌ 3న రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకు కోత పడ్డట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే కి అనుగుణంగానే రొమాంటిక్ సన్నివేశాలను దర్శకుడు పెట్టాడట. కానీ కొన్ని సన్నివేశాల్లో రొమాన్స్ ఎక్కువ అయ్యిందేమో కట్టింగ్స్ తప్పలేదు.

చిన్న చిన్న షాట్స్ సెన్సార్ కట్స్ పోయినా కూడా పొలిమేర 2 కచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనిపిస్తుంది. పొలిమేర 2 సినిమా కు చేసిన పబ్లిసిటీ వల్ల మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సినిమా కనుక పాజిటివ్ టాక్ దక్కించుకుంటే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి