Begin typing your search above and press return to search.

అప్పుడే ఓటీటీ లో వచ్చిన హిట్‌ మూవీ సీక్వెల్‌

అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమాను ప్రేక్షకులు చూడవచ్చు. తమిళంతో పాటు తెలుగు, కన్నడం మరియు మలయాళంంలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 12:01 PM GMT
అప్పుడే ఓటీటీ లో వచ్చిన హిట్‌ మూవీ సీక్వెల్‌
X

మోహన్‌ గోవింద్ దర్శకత్వంలో రూపొందిన పిజ్జా 3 సినిమా ఆగస్టు 18వ తారీకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల ద్వారా వచ్చిన ఈ సినిమాకు థ్రిల్లర్‌ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకా చాలా వరకు థియేటర్లలో సినిమా ఆడుతూనే ఉంది. ఈ సమయంలోనే పిజ్జా 3 సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలు అయినా మరే భాష సినిమాలు అయినా కూడా మినిమం నాలుగు లేదా ఐదు వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ద్వారా తీసుకు వస్తున్నారు. కానీ ఈ సినిమాను మాత్రం కేవలం వారం రోజుల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది.

అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమాను ప్రేక్షకులు చూడవచ్చు. తమిళంతో పాటు తెలుగు, కన్నడం మరియు మలయాళంంలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక యూఎస్ లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే అక్కడ తెలుగు మరియు తమిళ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతోంది.

గౌరవ్‌ నారాయణన్‌, కాళీ వెంకట్‌, అనుపమ కుమార్‌, అభిషేక్ శంకర్‌ ముఖ్య పాత్రల్లో కనిపించిన పిజ్జా 3 సినిమా కు అశ్విన్‌ హేమంత్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను ఓటీటీ లో చూడటం కోసం వెయిట్‌ చేసిన ప్రేక్షకులకు యూనిట్‌ సభ్యులు అనూహ్యంగా వారం రోజుల్లోనే అమెజాన్ ద్వారా తీసుకు వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. మరీ వారం రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ ఏంటి అంటూ కొందరు విమర్శిస్తున్నారు.